Monsoons: ఆలస్యం అవుతున్న రుతుపవనాలు.. కారణం ఏమిటో వివరించిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

|

Jun 09, 2022 | 4:49 AM

Monsoons: నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అరేబియా, బంగాళాఖాతంలో సముద్రపు గాలులు బలహీనంగా ఉండడంతో రుతుపవనాల విస్తరణ కాస్త నెమ్మదించినట్లు..

Monsoons: ఆలస్యం అవుతున్న రుతుపవనాలు.. కారణం ఏమిటో వివరించిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం
Follow us on

Monsoons: నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అరేబియా, బంగాళాఖాతంలో సముద్రపు గాలులు బలహీనంగా ఉండడంతో రుతుపవనాల విస్తరణ కాస్త నెమ్మదించినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో సముద్రంలోని తేమ భూమి మీదకు రావడం లేని, ఈ రెండు సముద్రాల్లోని గాలులు బలంగా ఉన్నప్పుడు అవి కలుస్తాయని, అప్పుడు సముద్రంలోని తేమ భూమి మీదకు వస్తుందని, దీంతో నైరుతి రుతుపవాలు వేగంగా విస్తరిస్తాయన్నారు. ఈ గాలులు రెండు, మూడు రోజుల్లో బలపడే అవకాశం ఉందన్నారు.

జూన్‌ 12వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యం కావడంతో రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయన్నారు. బుధవారం 22 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైగా నమోదయ్యాయని, రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 39 డిగ్రీలపైన, 3 జిల్లాల్లో 38 డిగ్రీలపైన, 2 జిల్లాల్లో 37 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌లో 45.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో గురువారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16 జిల్లాల్లో తేలిక పాటి వర్షం కురిసింది. అత్యధికంగా నారాయణపేట జిల్లా నర్వ 3.80, మొగలమడ్క 2.98 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి