Hyderabad Couple HiTech Farm : డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటాడు.. యాక్టర్ కొడుకు యాక్టర్ గా రాజకీయ నేతలు తనయులు తమ వారసులుగా తమ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావిస్తారు.. అయితే ఒక రైతు తన కొడుకు రైతుగా మారాలని అనుకోడు.. ఎందుకంటే మనదేశంలో వ్యవసాయం పండగ కాదు.. దండగ అనే భావన నెలకొంది. అందుకు తగినట్లుగానే అన్నదాత ఆరుగాలాలు కష్టపడి పడించిన పంట చేతికొచ్చే సమయాని ప్రకృతి కూడా పగబట్టిందా అన్నట్లు నష్టపరుస్తుంది. దీంతో తన అన్నదాత తన సంతానం బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నాడు..
అయితే ఓ యువ జంట తమకు లక్షల్లో జీతం ఇచ్చే ఉద్యోగాలను వదిలేసి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు వారు తమ వ్యవసాయ క్షేత్రం మరో 150మందికి పని కల్పించారు. ఆటోమేటిక్ సాంకేతిక నైపుణ్యంతో పంటలను పండిస్తూ లక్షలలో ఆర్హిస్తున్న ఈ జంట నేటి యువతకు స్ఫూర్తి దాయకం. వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ కు చెందిన సచిన్ , శ్వేతలు విదేశంలో ఉన్నత ఉద్యోగంలో స్థిరపడ్డారు. లక్షల్లో జీతాన్ని కాదనుకుని వ్యవసాయంపై మక్కువతో స్వదేశానికి వచ్చి ఆధునిక సాంకేతికతో వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. నిజానికి సచిన్ కుటుంబ నేపధ్యం వ్యవసాయం కాదు.. అయినప్పటికీ చిన్నతనం నుంచి వ్యవసాయం అంటే ఆసక్తి. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన సచిన్ చదువు పూర్తి కాగానే న్యూజిలాండ్ లో స్థిరపడ్డారు. దాదాపు 18 ఏళ్లపాటు ఓ ప్రముఖ కంపెనీలో సాప్ట్ వెట్ గా ఉద్యోగం చేశారు.
అయితే తిరిగి స్వదేశానికి రావాలని ఏదైనా చేయాలనే ఆలోచనతో సచిన్ 2013 లో ఇండియాకు వచ్చారు. హైద్రాబాద్ లోని శామీర్ పేట్ లో దాదాపు 10 ఎకరాల స్థలాన్ని కొని సింప్లీ ప్రెష్ పేరుతొ ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రకృతి సిద్ధమైన కూరగాలను పండిస్తూ.. నగరంలో పలు సూపర్ మర్కెట్స్ కు , హోటల్స్ కు సప్లై చేస్తున్నారు.
సచిన్ కు భార్య శ్వేత కూడా సహకారం అందించారు. విదేశంలో సాగు చేస్తున్న విధంగా ఆధునిక పద్ధతుల్లో కూరగాయలు సాగు చేయడం మొదలు పెట్టారు. ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా పూర్తి స్థాయిలో ప్రకృతి సిద్ధంగా కూరగాయలు పండిస్తున్నారు.
సింప్లీ ప్రెష్ ఫామ్ వ్యవయసాయ క్షేత్రంలో దాదాపు 150 రకాల కూరగాయలను పండిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ రోజుకి 8 వేల కిలోల వివిధ రకాల కూరగాయలు పండుతున్నాయి. ఈ కూరగాయల సాగుకు ప్రత్యేక నీటి వనరులను ఏర్పటు చేశారు. ఈ దంపతులు ఆశించినట్లుగా 2017-18 ఆర్ధిక సంవత్సరంలో మంచి ఫలితాలు అందుకున్నారు.
తాజాగా రెండు కోట్ల పెట్టుబడితో సిద్ధిపేటకు సమీపంలో మరో వ్యవసాయ క్షేత్రాన్ని 150 ఎకరాల్లో సచిన్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా దాదాపు 150రకాల కూరగాయలను పండిస్తున్నారు. ఈ రెండు క్షేత్రాల నుంచి దాదాపు రోజుకి 29 వేల కేజీల కూరగాయలను పండిస్తున్నామని సచిన్ శ్వేత దంపతులు చెప్పారు. ఆటోమేటిక్ సాంకేతిక నైపుణ్యంతో రూపొందిన ఈ వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 150మందికి ఉపాధిని కల్పించారు. ఇష్టంగా కష్టపడి ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తూ వ్యవసాయాన్ని పండగగా మార్చుకున్నారు ఈ యువ జంట సచిన్, శ్వేతలు. నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు.
Also Read: మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా..! అయితే ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం: తులసి మొక్కను ఏ దిశలో నాటాలో తెలుసా.. బాల్కానీలో ఆ దిశలో పెడితే ఈ సమస్యలను తప్పవు..
తెలంగాణలోని ఆ ప్రాంతంలో చేపలు విషపూరితం.. తిన్నారో అంతే సంగతులు