GHMC on Corona: కరోనా వైరస్ కట్టడికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ప్రజలకు మరింత చెరువులో వైద్య సేవలను తీసుకెళ్లేందుకు అధికారులు ముందడుగు వేశారు. తాజాగా గవర్నమెంట్ హాస్పటల్, పట్టణ ఆరోగ్య కేంద్రం మరియు బస్తీ దవాఖానాస్లలో ఔట్ పేషెంట్ క్లినిక్ కేంద్రాన్ని ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.
తాజాగా కరోనా కట్టడిపై తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా బీఆర్కే భవన్‌లో జోనల్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లతో సోమేశ్ కుమార్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రాంతాలలో కరోనాపై మరింత అవగాహన కల్పించాలని.. కరోనా రోగలక్షణం వున్నబాధితులకు ఇంటి వద్దనే చికిత్స తీసుకునే విధంగా .. కరోనా ట్రీట్ మెంట్ కిట్లను అందజేయాలని ఆదేశించారు. ఇలా కిట్లను అందజేయడం కోసం మున్సిపల్ ఉద్యోగులను, ఎఎన్ఎం లతో పాటు ఇద్దరు ఆశా వర్కర్స్ తో బృందాలను ఏర్పాటు చేయాలని సోమేశ్ కుమార్ సూచించారు.
ఈ బృందాలు ఆయా ప్రాంతాల్లో సందర్శించి.. జ్వరం , జలుబు వంటి ఇతర లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించాలని.. అందుకోసం ప్రతి ఒక్క ఇంటినీ ఈ బృందం సందర్శించాలని తెలిపారు. బాధితులను గుర్తించిన వెంటనే వారికీ ఏ విధమైన చికిత్స ఇవ్వాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనే విషయంపై ఈ బృందం అవగాహన కల్పించాలని .. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలన్నారు సోమేశ్ కుమార్. ముఖ్యంగా జీహెచ్ఎం సీ పరిశరప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద, బస్తి దవాఖానల వద్ద పరిశుభ్రత ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ నగరంలోని అన్ని సర్కిల్స్‌లో కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించాలని సూచించారు. భాగ్యనగరాన్ని కరోనా ఫ్రీ గా చేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.