Hyderabadi biryani: అంతర్రాష్ట్ర దొంగను పట్టించిన హైదరాబాద్ బిర్యానీ..! ట్విస్ట్‌ మామూలుగా లేదు..!!

|

Jun 24, 2022 | 7:51 PM

హైదరాబాద్‌ బిర్యానీకి మరో క్రెడిట్‌ దక్కింది. హైదరాబాద్‌ బిర్యానీ ఇప్పుడు గజ దొంగల్ని కూడా పట్టిస్తుంది. అదేదో అల్లాటప్ప దొంగ కాదు..ఏకంగా అంతర్‌ రాష్ట్ర దొంగనే పట్టించింది మన హైదరాబాద్‌ బిర్యానీ. అదేలాగంటే..

Hyderabadi biryani: అంతర్రాష్ట్ర దొంగను పట్టించిన హైదరాబాద్ బిర్యానీ..! ట్విస్ట్‌ మామూలుగా లేదు..!!
Follow us on

హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు.. ప్రపంచ వ్యాప్తంగా నాన్‌వెజ్‌ ప్రియులను ఊరుస్తుంది మన బిర్యానీ. హైదరాబాద్‌కు వచ్చిన అతిథులు ఎవరైనా సరే, తప్పనిసరిగా ఇక్కడి బిర్యానీ టెస్ట్‌ చేయకుండా వెళ్లరు… అయితే, ఇప్పుడు హైదరాబాద్‌ బిర్యానీకి మరో క్రెడిట్‌ దక్కింది. హైదరాబాద్‌ బిర్యానీ ఇప్పుడు గజ దొంగల్ని కూడా పట్టిస్తుంది. అదేదో అల్లాటప్ప దొంగ కాదు..ఏకంగా అంతర్‌ రాష్ట్ర దొంగనే పట్టించింది మన హైదరాబాద్‌ బిర్యానీ. అదేలాగంటే..

మలక్‌పేట పరిధిలోని వెంకటాద్రినగర్‌ కాలనీలో నివాసముంటున్న కారు మెకానిక్‌ సయ్యద్‌ ఇఫ్తేకారుద్దీన్‌ మే 14న ఇంటికి తాళం వేసి నగరంలోని తన మామ ఇంటికి వెళ్లాడు. ఇదే అదునుగా దొంగలు ఇఫ్తే ఇంటిని లూటీ చేశారు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన ఇఫ్తే ..ఇంటి తాళాలు పగిలి ఉన్నట్లుగా గుర్తించి మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించినపోలీసులు చోరీ జరిగిన ఇంటి సమీపంలో నమోదైన మొబైల్‌ కాల్‌ డేటాను సేకరించారు. మొబైల్‌ నంబర్‌పై కూపీ లాగి నిందితుడిని కర్ణాటకలోని మైసూర్‌ హలే కేసరేలో నివాసముంటున్న సయ్యద్‌ ఐజాజ్‌ అలియాస్‌ ఇమ్రాన్‌గా గుర్తించారు. ఇమ్రాన్‌ను పట్టుకునే క్రమంలో హైదరాబాద్‌ బిర్యానీ కీలకంగా మారింది. ఎందుకంటే..

హైదరాబాద్ వచ్చి నగరంలో తాళం వేసిన ఇళ్లను గుర్తించి, తాళం పగుల గొట్టి విలువైన నగలు, నగదును దోచుకోవడం వృత్తిగా పెట్టుకున్నాడు ఇమ్రాన్‌. దోచుకున్న నగలు, నగదుతో తిరిగి వెళ్లే సమయంలో అతనికి ఇష్టమైన హైదరాబాద్‌ బిర్యానీని ఆరగించడం అలవాటు. ఆ అలవాటే అతన్ని పోలీసులకు దొరికిపోయేలా చేసింది.  మెహిదీపట్నంలో ప్రైవేట్ ట్రావెల్స్ పేరు పై జొమాటో ద్వారా బిర్యానీ తెప్పించుకుని, ఆ ట్రావెల్స్‌ నుంచి బెంగళూరుకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకునేవాడు. ఈ సారి కూడా అదే చేశాడు.. కానీ, పాపం కథ అడ్డంతిరిగి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. బిర్యానీ కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు మొబైల్‌ నంబర్‌ ద్వారా జరిగినట్లుగా గుర్తించిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా పోలీసులకు పట్టుబడ్డాడు.

ఇవి కూడా చదవండి

కాల్‌డేటా ఆధారంగా మలక్‌పేట క్రైం ఇన్‌స్పెక్టర్‌ నానునాయక్‌తో కూడిన క్రైం పోలీసుల బృందం బెంగళూరులో నిందితుడు సయ్యద్‌ ఐజాజ్‌ ఉన్నట్లుగా గుర్తించి పట్టుకున్నారు. అతడి నుంచి రూ.2.50లక్షలు, 85 గ్రాముల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి నగరంలో జరిగిన తొమ్మిది కేసులతో సంబంధమున్నట్లుగా గుర్తించారు..అతను చేసిన దొంగతనాలు గురించి వివరాలను సేకరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి