Omicron: హైదరాబాద్ సరూర్‌నగర్లో కరోనా కలకలం సృష్టించింది. వలమియా మెడికల్ కాలేజీలో ముగ్గురికి కరోనా సోకింది. మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని, రేపు ఉదయంలోపు ఎన్ని కేసులు బయటపడుతాయనేది తెలుస్తుందన్నారు. కాగా, మెడికల్ కాలేజీలో కరోనా కేసులు బయటపడటంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
ఇదిలాఉంటే.. సూర్యాపేట జిల్లా డీఎంహెచ్ఓ కోటాచలం కుటుంబ సభ్యులందరూ కరోనా బారిన పడ్డారు. కోటాచలం కుమారుడు ఐదు రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చాడు. అతని ద్వారా కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకినట్లు తెలుస్తోంది. అయితే, డీఎంహెచ్ఓ కుటుంబ సభ్యులంతా రెండు రోజుల క్రితం తిరుపతికి వెళ్లొచ్చారు. ఇక డిసెంబర్ 1వ తేదీన సూర్యాటపేలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కోటాచలం పాల్గొన్నారు.
కాగా, అత్యంత ప్రమాద కారిగా భావిస్తున్న ఒమిక్రాన్ వైరస్ భారత్‌లోకి ఎంటరైంది. బెంగళూరులోనే రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఒమిక్రాన్ సోకిన వారిలో ఒకరికి 66 సంవత్సరాలు, మరొకరికి 46 సంవత్సరాలు. కాగా, వైరస్ సోకిన వారికి టచ్‌లో ఉన్న వారిని అధికారులు ట్రేస్ చేస్తున్నారు. తాజా కేసులతో ఒమిక్రాన్ వేరియంట్ దేశాల జాబితాలోకి ఇండియా చేరింది. దేశంలో మరింత ప్రబలే ప్రమాదం ఉంది.
Also read:
HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్ భగాయత్ గజం ఎంతో తెలుసా..
Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్