Huzurabad By Election: హుజూరాబాద్‌లో ఉద్రిక్తత.. TRS లీడర్ కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న BJP కార్యకర్తలు..

|

Oct 30, 2021 | 1:44 PM

HuzurabadByElection: హుజూరాబాద్ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఘన్ముక్లలో టీఆర్ఎస్ నాయకుడు..

Huzurabad By Election: హుజూరాబాద్‌లో ఉద్రిక్తత.. TRS లీడర్ కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న BJP కార్యకర్తలు..
Kaushik Reddy
Follow us on

HuzurabadByElection: హుజూరాబాద్ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఘన్ముక్లలో టీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. పోలింగ్ బూత్ వద్ద ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇక వీణవంక మండలంలో రెండు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కోర్కల్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఇరువర్గాల ప్రజలను చెదరగొట్టారు. ఇల్లంధకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో ప్రజలను ప్రలోబాలకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ ఇన్‌చార్జ్, గజ్వెల్ మార్కెట్ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ పై ప్రత్యర్థి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోలీంగ్ స్టేషన్ వద్ద టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే కల్పించుకున్న పోలీసులు.. ఇరు వర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు.

ఇదిలాఉంటే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని జూనియర్ కాలేజీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ కూడా కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హుజూరాబాద్‌లో ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. 10 గంటల వరకు హుజూరాబాద్‌లో 15 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, హుజూరాబాద్‌లో 6 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఔటర్స్‌పై రెండు ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయని, కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ కర్ణన్ తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని కలెక్టర్ చెప్పారు.

Also read:

T20 World Cup 2021: టీం ఇండియా బీచ్ వాలీబాల్.. వైరల్‎గా మారిన వీడియో..

Raghuram Rajan: భారతీయుల్లో నమ్మకం సన్నగిల్లింది.. దేశ ఆర్థిక వ్యవస్థపై రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు

IRCTC: ఎదురు తన్నిన నిర్ణయం.. ప్రభుత్వం ఐఆర్సీటీసీలో 200 కోట్ల వాటా కోసం చూస్తే.. 1800 కోట్లు మునిగిపోయింది..