మరికొన్ని గంటల్లో జరగబోతున్న హుజురాబాద్ ఉప ఎన్నికపై భారీ బెట్టింగ్‌లు జరుగుతున్నాయని సమాచారం. ఒక వైపు వరల్డ్ కప్ టీ20 జరుగుతున్న బెట్టింగ్‌రాయుళ్లు దృష్టి మాత్రం హుజురాబాద్ ఎన్నిలపైనే ఉంది. హుజురాబాద్‌పైనే ఎక్కువ బెట్టింగ్ నడుస్తోందని తెలుస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి హుజురాబాద్ పొలిటికల్ లీగ్‌పైనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్దయెత్తన బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. హాట్ ఫేవరెట్ ఎవరంటూ వాకబు చేస్తున్నారు కొందరు. మీడియా ప్రతినిధులకు బెట్టింగ్‌రాయుళ్లు ఫోన్‌లు చేస్తున్నారు. వివరాలు తెలుసుకుని బెట్టింగ్‌లు కడుతున్నారు. మూడు విభాగాలుగా ఈ బెట్టింగ్ నడుస్తోంది. పోలింగ్ ముందు, పోలింగ్ తరువాత ఒక తరహా బెట్టింగ్. హాట్ ఫేవరెట్‌పై 10 వేలు పెడితే లక్ష ఇచ్చేట్లుగా పందాలు కాస్తున్నారని తెలుస్తోంది.
ఇక మూడో రకం.. కౌంటింగ్ రోజు మరో తరహా బెట్టింగ్ ఉంటుంది. 50 వేలు పెడితే 5 లక్షలు ఇచ్చేట్టు. ఇదంతా ఆన్‌లైన్‌లోనే నడుస్తుందట. క్రికెట్ కన్నా ఇప్పుడు హుజురాబాద్ పొలిటికల్ లీగ్ HPLపైనే ఎక్కువ బెట్టింగ్ జరుగుతోంది. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి పెట్టినట్లుగా సమాచారం. ఇలాంటి దందాలకు తెరలేపితే చట్టప్రకారం చర్యలు ఉంటాయని అంటున్నారు.
ఇదిలావుంటే.. డబ్బులు ఇవ్వాలని ఆందోళన చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ చెప్పారు. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించామన్నారు. హుజురాబాద్ బై ఎలక్షన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. ఎలక్షన్ సామాగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని వివరించారు. 30 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారని.. బ్లైండ్ పర్సన్స్ కోసం బ్రేల్ బ్యాలెట్ పేపర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3865 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని.. ప్రతీ బూత్‌లో వెబ్ కాస్టింగ్ తో పర్యవేక్షణ చేయనున్నట్లు వివరించారు.
ఇవి కూడా చదవండి: Leander Paes – TMC: గోవా రాజకీయాల్లో మరో సంచలనం.. టీఎంసీలో చేరిన టెన్నిస్ స్టార్ ప్లేయర్
Facebook Smartwatch: ఆపిల్ వాచ్‌కు పోటీగా మెటా స్మార్ట్‌వాచ్.. ఇందులోని అద్భతమైన ఫీచర్స్ ఇవే..