Huzurabad By Election: ఆసక్తికరంగా హుజురాబాద్ బైపోల్‌ వార్.. నామినేషన్ వేసిన ఈటల జమున.. ఈనెల 8న ఈటల నామినేషన్!

|

Oct 04, 2021 | 6:44 PM

Huzurabad By Poll: హుజురాబాద్ ప్రీమియర్ లీగ్‌లో మరో ట్విస్ట్. వార్‌ సీన్‌లోకి నిరుద్యోగులు, ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఎంట్రీ. పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు సై అంటున్నారు.

Huzurabad By Election: ఆసక్తికరంగా హుజురాబాద్ బైపోల్‌ వార్.. నామినేషన్ వేసిన ఈటల జమున.. ఈనెల 8న ఈటల నామినేషన్!
Huzurabad By Election
Follow us on

Huzurabad By Election: హుజురాబాద్ ప్రీమియర్ లీగ్‌లో మరో ట్విస్ట్. వార్‌ సీన్‌లోకి నిరుద్యోగులు, ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఎంట్రీ. పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు సై అంటున్నారు. ఇప్పటికే ముగ్గురు బరిలో నిలిచారు. గడవు ముగిసేలోగా దాదాపు వెయ్యి మందితో నామినేషన్లు వేసేలా స్కెచ్ వేస్తున్నారు. ఈ ఇష్యూ ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది.

ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోరుగా ఉంది. మెయిన్‌ వార్ మాత్రం గులాబీ-కమలం మధ్యే.. ఇది హుజురాబాద్‌లో ప్రజెంట్ సిట్యుయేషన్. కానీ చెప్పినట్లుగానే ఉప యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తున్నారు నిరుద్యోగులు. ఫీల్డ్ అసిస్టెంట్లు..

హుజురాబాద్ బైపోల్‌కు సోమవారం నాటికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ సతీమణి జమునా రెడ్డి తరుపున కుటుంబ సభ్యులు నామనేషన్ పత్రాలు సమర్పించారు. ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ తీరుకు నిరసన తెలపాలని నిరుద్యోగులు నిర్ణయించారు. దీంతో అటు ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులూ నామినేషన్ వేసేందుకు క్యూ కడుతున్నారు. పెద్దఎత్తున నామినేషన్ పేపర్లు తీసుకున్నారు. ఈ నాలుగు రోజుల్లో వీలైనంత ఎక్కువమందితో నామినేషన్లు వేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కుటుంబాలతో సహా వచ్చి మకాం వేస్తున్నారు. రాష్రవ్యాప్తంగా ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల అంతా చలో హుజురాబాద్ అంటున్నారు. విడతల వారీగా నామినేషన్లు వేస్తామని ఇవాళ 50 మంది నామినేషన్లు వేస్తాం మొత్తం వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లు బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 2020లో ప్రభుత్వం తమను నిర్దాక్షిణ్యంగా తొలగించిందన్నారు. తమ ఉద్యోగాలు తిరిగి ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌ల రాష్ట్ర అధ్యక్షుడు శ్యామలయ్య తెలిపారు.

అటు టీఆర్ఎస్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు నేతలు. అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తోపాటు మాజీ ఎంపీ వినోద్ ప్రచారంలో పాల్గొన్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా ఉన్నది టీఆర్‌ఎస్‌ పార్టీనేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే అన్నదాతలకు మద్దతు ధరలు వచ్చాయన్నారు. మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన ఈటల ఇప్పుడు ఆ పార్టీకి ఎలా కొమ్ము కాస్తున్నాడని మండిపడ్డారు.

ఇదిలావుంటే, మినేషన్లు వేసే RDO ఆఫీసు వద్ద 144 సెక్షన్ పెట్టారు. అభ్యర్థి తో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తున్నారు. సోమవారం ఈటల జమునతోపాటు మరో ఇద్దరు అభ్యర్థులు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. మంగళవారం ఎక్కువ సంఖ్యలో పడే అవకాశం ఉంది. నామినేషన్లు స్వీకరణ మొదలైన తొలిరోజే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్ వేశారు. ఈనెల 8న బీజేపీ అధికారిక అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Read Also….  PM Modi: ప్రధాని మోడీ ప్రజా సేవకు అంకితమై ఇరవై యేళ్లు.. అక్టోబర్ 7న పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమైన బీజేపీ