Huzurabad By Election: హుజురాబాద్ పోలింగ్ రేపే.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు

|

Oct 29, 2021 | 7:40 PM

మొన్నటి వరకు నేతల వంతు. ఇప్పుడు ఓటర్ల వంతు. హుజూరాబాద్‌ ప్రజలు తమ ఓపీనియన్‌ను చెప్పే టైం వచ్చింది. శనివారం ఉదయం నుంచి పోలింగ్‌ జరుగుతుంది. ఉప ఎన్నికకు ఏర్పాట్లన్నీ..

Huzurabad By Election: హుజురాబాద్ పోలింగ్ రేపే.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు
Polling Arrangements
Follow us on

మొన్నటి వరకు నేతల వంతు. ఇప్పుడు ఓటర్ల వంతు. హుజురాబాద్‌ ప్రజలు తమ ఓపీనియన్‌ను చెప్పే టైం వచ్చింది. శనివారం ఉదయం నుంచి పోలింగ్‌ జరుగుతుంది. ఉప ఎన్నికకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది ఎన్నికల సంఘం. మూడు నెలల నుంచి రాజకీయ వేడిని పెంచిన హుజురాబాద్‌లో పోలింగ్‌ సమయం వచ్చేసింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం 30 మంది పోటీలో ఉన్నారు. 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు లక్షా 19వేల 102మంది, పురుషులు లక్షా 17వేల 993మంది ఉన్నారు. పోలింగ్‌ సిబ్బంది సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు.

ఉప ఎన్నిక పోలింగ్‌ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల చెక్‌పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. నేతల వాహనాలను సైతం చెక్‌ చేశారు. 20 కంపెనీల కేంద్ర బలగాలు, 4 వేల మంది రాష్ట్ర పోలీసులు బందోబస్తులో ఉన్నారు. మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 172 సమస్యాత్మకమైనవిగా, 63 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు భద్రతా సిబ్బంందిని పెట్టారు.

గత ఎన్నికల్లో 84.42 శాతం పోలింగ్‌ జరిగింది. ఈసారి అంతకన్నా ఎక్కువే ఓట్లు పోలవుతాయని తెలుస్తోంది. ఎందుకంటే గతంకన్నా 27 వేల మంది ఓటర్లు పెరిగారు. పార్టీలు సైతం పెద్దయెత్తున ప్రచారం చేయడం ఓటింగ్‌ శాతాన్ని పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌.

కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ పెట్టుకుని పోలింగ్‌ కేంద్రానికి రావాలని సూచించారు అధికారులు.

ఇవి కూడా చదవండి: Long Range Bomb: చైనాకు ఇక దబిడి దిబిడే.. మొన్న అగ్ని 5.. నేడు లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం విజయవంతం..

Heart attack: గుండెపోటు వచ్చిన ఆ గంట చాలా కీలకం.. ఏం చేయాలో తెలుసుకోండి..