Etela Rajender Singapore Campaign: హుజురాబాద్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సింగపూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. “నన్ను వెనుపోటు పొడిచింది కేసీఆర్. నన్ను బయటికి పంపించింది కేసీఆర్. నాకు ద్రోహం చేసింది కేసీఆర్. నా కళ్ళల్లో మట్టి కొట్టింది కేసీఆర్. కేసీఆర్ నన్ను 18 సంవత్సరాలు ఉద్యమంలో వాడుకొని తెలంగాణ వచ్చిన తరువాత బయటికి పంపించిండు.” అని ఈటల కామెంట్ చేశారు.
“కేసీఆర్ ది మొసలి కన్నీరు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగితే తెరాసా వారికి డిపాజిట్ కూడా రాదు. మేము ఎవరి జోలికి పోము, మా జోలికి ఎవరు రావద్దు. వస్తే ఊరుకోం. ఎన్నికల తరువాత సిద్దిపేటకు వస్తా. మీ సత్తా ఏంది నా సత్తా ఏంది తేల్చుకుందాం. తెలంగాణలో దుర్మార్గం చెల్లదు. ఈ రోజు మీరు నన్ను సింగాపూర్ లో అడ్డుకోవచ్చు కానీ, మేము తలుచుకుంటే ఎక్కడా అడుగుపెట్టలేరు. ఉత్తగానే ఊడిపడలేదు నేను. నా మీటింగ్ కు రావిద్దని బెదిరిస్తున్నారు. నీ అబ్బ జాగీరా కేసీఆర్.” అంటూ పరుష పదజాలాన్ని వాడారు ఈటల.
“తెలంగాణ ప్రజల జాగీరు. నువ్వు ఓనర్ కాదు కాపలాదారు. దళితుల మీద ప్రేమ ఉంటే.. కలెక్టర్ల, బ్యాంక్ మేనేజర్ పెత్తనం ఉండవద్దు. వెంటనే దళిత బంధు ఇవ్వాలి అని బీజేపీ ఇప్పటికే కేసు వేసింది. దొంగ లేఖలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోచమ్మ గుడికి రమ్మంటే ఎవడూ రాలేదు. పర్మిషన్ లేదు అంటూ అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఇది కరెక్ట్ కాదు. దీనిపై ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేస్తా. నన్ను వెనుపోటు పొడిచింది ముమ్మాటికీ కేసీఆరే.” అని ఈటల చెప్పుకొచ్చారు.
Read also: Kannababu: 36 గంటల పాటు ఒక స్కిట్ చేశారు.. చంద్రబాబు దీక్షపై మంత్రి కన్నబాబు సెటైర్లు