ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.. అన్యోన్యంగా సాగుతున్న జీవితంలో అనుకోని ఘటన
ఇద్దరు ఒకరినొకరు ఇష్ట పడ్డారు. ప్రేమించుకున్నారు. పెద్దల దీవెనలతో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ పెళ్లికి ఆ దేవతల ఆశీస్సులతో ఒక పాప కూడా జన్మించింది. ఎంతో ప్రేమగా జీవించే ఈ కుటుంబానికి వాళ్ళే ప్రపంచం. ఎన్నడు ఒకరిని విడిచి మరొకరు లేరు.
ఇద్దరు ఒకరినొకరు ఇష్ట పడ్డారు. ప్రేమించుకున్నారు. పెద్దల దీవెనలతో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ పెళ్లికి ఆ దేవతల ఆశీస్సులతో ఒక పాప కూడా జన్మించింది. ఎంతో ప్రేమగా జీవించే ఈ కుటుంబానికి వాళ్ళే ప్రపంచం. ఎన్నడు ఒకరిని విడిచి మరొకరు లేరు. ఎంతో సంతోషంగా గడిపే ఆ కుటుంబానికి విధి వక్రించింది. అనుకోని ఘటనతో భార్యను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్ళింది. తన భార్య…తన కుటుంబం సర్వస్వం అనుకున్న ఆ భర్తకు ఎంతో ఘాడంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య అనంతలోకాలకు వెళ్ళడం తనను కుంగిపోయేలా చేసింది. తన భార్య పై ప్రేమను ఎన్నటికీ వీడను అనేలా.. భార్య చేతిలో చెయ్యి వేసి.. హ్యాండ్ కాస్టింగ్ చేయించుకుని ఇంట్లో పెట్టుకున్నాడు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం యడ్ల బంజరు గ్రామానికి చెందిన అశోక్ ఖన్నా, పద్మశ్రీలు 16 ఏళ్ల క్రితం ప్రేమించి పెద్దల ఆశీస్సులతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా జన్మించింది. ఈ కుటుంబాన్ని చూసి జనాలు ఎంతో ముచ్చట పడేవారు. పెళ్ళై 16 ఏళ్ళు అయినా.. నూతన దంపతుల మాదిరి సంతోషంగా ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు. ప్రతి ఏడాది విహారయాత్రలకు కుటుంబంతో ఆలయాలకు వెళ్లి అర్చనలు చేసుకుని ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ.. ఎంతో ప్రేమ ఉండేవారు. అలాంటి ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
నిత్యం పూజలు చేసే అశోక్ ఖన్నా సతీమణి పద్మశ్రీకి గత కొద్ది రోజులుగా జ్వరం వచ్చింది. మెరుగైన వైద్యం చేయించినప్పటికి విధి మృత్యు రూపంలో ఆ ఇద్దరి భార్య భర్తల ప్రేమను వేరు చేస్తూ.. పద్మశ్రీని బలి తీసుకుంది. భార్య అంటే ఎంతో ప్రేమ ఉన్న అశోక్ ఖన్నా భార్య తనతో లేదనే నిజాన్ని భరించలేక పోయాడు. తమ ప్రేమ శాశ్వతం గా ఉండాలని.. తనను ఎప్పటికీ విడిచి ఉండలేనని.. జీవితాంతం గుర్తుండేలా భార్య చేతిలో.. చెయ్యి వేసి.. ఆ చేతులను హ్యాండ్ కాస్టింగ్ చేయించుకుని ఇంట్లో భద్రంగా పెట్టుకున్నాడు. ఆ భార్య భర్తల అనుబంధాన్ని దేవుడు దూరం చేశాడు అంటూ గ్రామస్థులు, శ్రేయోభిలాషులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
వీడియో చూడండి…
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..