
ఈ క్రైమ్ కహానీ జరిగింది హైదరాబాద్‌లోనే.. ఒకప్పుడు పెద్ద సెన్సేషన్‌గా మారింది. అంతా ఆమెది సహజ మరణం అని అనుకున్నారు. కానీ పోస్టుమార్టంలో సంచలన నిజాలు బయటపడ్డాయి. కిడ్నీ ఫెయిల్యూర్‌తోనే బాధితురాలు చనిపోయిందని రిపోర్టులో తేలినా.. వైద్యులకు వచ్చిన చిన్న అనుమానం హంతకుడిని పట్టించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫోరెన్సిక్ డాక్టర్ చెప్పిన ఆ నిజాలు మళ్లీ ఈ కేసు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. సదరు నిందితుడు ఓ సైంటిస్ట్.. బాగా చదువుకున్న అమ్మాయితో పెళ్లైంది. ఇక వీళ్ళిద్దరి లైఫ్ కూడా స్టార్టింగ్‌లో బాగానే ఉంది. అయితే అదే సమయంలో మనం లైఫ్‌లో సెటిల్ అయ్యేంతవరకు కొద్దికాలం పిల్లలు వద్దు అని అన్నాడు. దానికి ఆమె కూడా సరేనని చెప్పింది. అయితే శృంగారం చేసే ముందు ప్రతీసారి భర్త ఓ పాడుపని చేసేవాడు. చింతపండును తెచ్చి ఏదో చేసేవాడు. ముందుగా ఆమె పట్టించుకోలేదు గానీ.. ఆ తర్వాత అనుమానమొచ్చి అడిగింది. అందుకు భర్త ఓ ఆసక్తికర సమాధానం చెప్పాడు. చింతపండుతో అలా చేస్తే.. మనకు పిల్లలు పుట్టరని భార్యకు చెప్పి.. ఆమెను నమ్మించాడు. భర్త సైంటిస్ట్ కావడంతో.. భార్య కూడా సరేనని.. ఆపై దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కట్ చేస్తే.! ఆమెకు ఏడాది తర్వాత నుంచి అనారోగ్య సమస్యలు రావడం మొదలయ్యాయి. ఆపై సీరియస్ అయింది. హస్పిటల్‌లో చేర్పించారు. ఇక టెస్టులు చేయగా.. డాక్టర్లు ఆమె రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తేల్చారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ కొద్దిరోజుల తర్వాత ఆమె మరణించింది. అత్తమామలు, ఆమె పేరెంట్స్ కూడా సదరు బాధితురాలిది సహజ మరణం అని నమ్మారు.
కానీ డాక్టర్లకు అనుమానమొచ్చింది. అంతా ఆరోగ్యం మంచిగా ఉన్న ఆమె.. సడన్‌గా కిడ్నీలు ఫెయిల్ అయ్యి చనిపోవడం ఏంటి.? ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పి.. డెడ్‌బాడీకి మళ్లీ రీ-పోస్టుమార్టం చేశారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో ఆమె చనిపోయినట్టు తేలింది. అలాగే ఆమె కిడ్నీలు చనిపోవడానికి ఓ రసయాన్ని వాడినట్టు గుర్తించారు. ఆ కెమికల్ కారణంగానే తక్కువ సమయంలో ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయి. చివరికి ప్రాణాలు కోల్పోయింది. సదరు నిందితుడు భార్యపైన అనుమానంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని.. దాన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు శృంగారం సమయంలో జననేంద్రియం దగ్గర చింతపండు పెట్టేవాడు. అదే ఆమె మరణానికి కారణమైంది. ఇక ఇప్పుడు ఆ క్రిమినల్ సైంటిస్ట్ జైల్లో ఊసలు లెక్కపెడుతున్నాడు. కాగా, సుమారు అయిదారేళ్ళ క్రితం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.