AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కట్టుకున్న భార్యను కర్రతో కొట్టి చంపి.. పోలీస్ స్టేషన్‌‌లో లొంగిపోయిన భర్త..!

భార్యను అతి కిరాతకంగా హతమార్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఓ భర్త. ఈ దారుణమైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, భార్య నిలదీయడంతో విచక్షణ కోల్పోయి కిరాతకానికి పాల్పడ్డాడు. 30 ఏళ్ల దాంపత్య బంధానికి తెర దించాడు భర్త నాగశేషి.

కట్టుకున్న భార్యను కర్రతో కొట్టి చంపి.. పోలీస్ స్టేషన్‌‌లో లొంగిపోయిన భర్త..!
Murder Case
Balaraju Goud
|

Updated on: May 31, 2025 | 2:49 PM

Share

భార్యను అతి కిరాతకంగా హతమార్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఓ భర్త. ఈ దారుణమైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, భార్య నిలదీయడంతో విచక్షణ కోల్పోయి కిరాతకానికి పాల్పడ్డాడు. 30 ఏళ్ల దాంపత్య బంధానికి తెర దించాడు భర్త నాగశేషి.

నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామానికి చెందిన గొల్ల ఎలుక నాగశేషి, భార్య ఎల్లమ్మ(40)కు 1995లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఒక కూతురు ఉన్నారు. ఆలుమగలు ఇద్దరు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేస్తున్నారు. 30 ఏళ్లుగా పచ్చగా సాగుతున్న వీరి సంసారంలో భర్త వివాహేతర సంబంధం, మద్యం అలవాటు చిచ్చురేపింది.

అప్పుడప్పుడు వీరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్న కొద్దిసేపటికే సద్దుమణిగేది. అయితే మే 29వ తేదీన నాగశేషి బావమరిది ముంత శ్రీనివాస్ దంపతులకు వడి బియ్యం పెట్టి రాత్రి వారిని ఇంటికి పంపించారు. అదే వేడుక సందర్భంగా రాత్రి నాగశేషి ఎక్కువగా మద్యం సేవించాడు. రాత్రి సుమారు 10.30 నిమిషాల సమయంలో నాగశేషి, భార్య ఎల్లమ్మకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త వివాహేతర సంబంధాన్ని భార్య ఎల్లమ్మ నిలదీయడంతో గొడవ కాస్త పెద్దదైంది. దీంతో ఆగ్రహించి ఎల్లమ్మను నాగశేషి విచక్షణ రహితంగా కర్రతో దాడి చేశాడు. అడ్డుకోబోయిన తండ్రి బిచ్చన్నను పక్కకు తోసేశాడు.

తీవ్ర గాయాలైన ఎల్లమ్మ, నాగశేషి తండ్రి కేకలు వేయడంతో చుట్టూ పక్కల వారు గమనించి వనపర్తి ఆస్పత్రికి తరలించారు. అర్దరాత్రి చికిత్స పొందుతూ ఎల్లమ్మ మృతి చెందింది. ఘటన అనంతరం తన భార్యను తానే చంపానని పోలీసుల ఎదుట లొంగిపోయాడు భర్త నాగశేషి. ఎల్లమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గ్రామానికి తీసుకుని వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. మద్యం మత్తులోనే ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక మూడు దశాబ్దాల దాంపత్య జీవితాన్ని వివాహేతర సంబంధం అనుమానాలు, మద్యం మత్తు చిత్తు చేసింది. అనుకోని ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా