
ఇటీవల కాలంలో భర్తలపై దాడులతో పాటు హత్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్యల వేధింపులకు చెక్ పెట్టేందుకు భార్య బాధితుల సంఘం పోరాటానికి సిద్ధమవుతోంది. భర్తలపై అరాచకాలు పెరుతున్న దృష్ట్యా మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు భార్య బాధితుల సంఘం పేర్కొంది.. వేధిస్తున్న భార్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.. కరీంనగర్‌లో సమావేశమైన సంఘం ప్రతినిధులు.. భష్యత్ కార్యచరణ ప్రకటించారు.. ఎలాంటి వేధింపులు లేకున్నా.. భార్యలు అరాచకాలకు పాల్పడుతున్నారని… భర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇక.. న్యాయ పోరాటం చేస్తామని భార్య బాధితుల సంఘం నేతలు చెబుతున్నారు..
కరీంనగర్ జిల్లా కేంద్రంలో.. తెలంగాణ భార్య బాధితుల సంఘం ప్రత్యేక సమావేశం జరిగింది. ఇటీవల కరీంనగర్ జిల్లాలో.. ఒక్క వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు హత్యకు గురయ్యారు.. బలవతంగా విడాకులు తీసుకోవాలని బెదిరించడంతో.. శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి చనిపోయారని భార్య బాధితుల సంఘం నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో సభ నిర్వహించగా.. దీనికి వివిధ ప్రాంతాలకు చెందిన భార్య బాధితుల సంఘం నేతలు తరలివచ్చారు. రెండు గంటల పాటు ప్రత్యేక సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భర్తలపై వివిధ రకాల కేసులపై చర్చించారు.. మగవారిది తప్పు లేకున్నా.. విడాకుల చట్టంతో పాటు గృహహింస చట్టం కూడా నమోదు చేస్తున్నారని భార్య బాధితుల సంఘం ప్రతినిధులు ఆరోపించారు. అంతేకాకుండా.. ఇటీవల.. భర్తల హత్యలు పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నుంచి భర్తలను వేధిస్తే.. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. భర్తలను వేధించే మహిళల ఇంటి ముందే ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా.. భర్తలను వేధింపులకు గురి చేస్తున్న మహిళలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
భర్తలను చంపిన భార్యలకు త్వరగా శిక్షపడేందుకు.. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని భార్య బాధితుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి విన్నవించారు. ఇక నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో.. భార్య బాధితుల సంఘం ఆధ్వర్యంలో.. సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేధింపులకు గురవుతున్న భర్తలకు.. న్యాయ సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేక సెల్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అడ్వకేట్ల సహాయంతో.. తప్పుడు కేసులు నమోదవకుండా చూస్తామన్నారు. విడాకుల కేసు షయంలో పూర్తి స్థాయిలో విచారణ చేసిన తరువాత.. కేసులు నమోదు చేయాలని అధికారులకు విన్నవించారు. అదే విధంగా.. పథకం ప్రకారం.. భర్తలను హత్య చేస్తున్నారని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి.. పెద్ద ఎత్తున పోరాటం చేసి.. భర్తల హక్కులను కాపాడుతామని భార్య బాధితుల సంఘం నేతలు చెప్పారు. ఇటీవల.. భర్తలు తీవ్రమైన వేధింపులకు గురవుతున్నారని.. అంతటితో ఆగకుండా భార్యలు హత్యలు కూడా చేస్తున్నారని ఆరోపించారు. భర్తల హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..