AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో కాల్పులు జరిపి గోల్డ్ షాపులో..

హైదరాబాద్ చందానగర్‌లో భారీ దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు గన్‌తో కాల్పులు జరిపి ఖజానా జ్యువెలరీ షాప్‌లో చోరీకి పాల్పడ్డారు. షాప్ తెరిచిన ఐదు నిమిషాల్లోనే ఈ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. డిప్యూటీ మేనేజర్ కాళ్లపై దుండగులు కాల్పులు జరిపారు. దోపిడికి పాల్పడ్డ దుండగులు జహీరాబాద్ వైపు పారిపోగా.. పోలీసుల గాలింపు కొనసాగుతోంది.

Hyderabad: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో కాల్పులు జరిపి గోల్డ్ షాపులో..
Khajaza Jewellers
Krishna S
|

Updated on: Aug 12, 2025 | 12:19 PM

Share

హైదరాబాద్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. చందానగర్‌లో భారీ దోపిడికి యత్నించారు. ఐదుగురు దుండగులు ఖజానా జ్యువెలరీ షాప్‌లో చొరబడి గన్‌తో కాల్పులు జరిపారు. చంపేస్తామని బెదిరించి లాకర్ కీ తీసుకున్నారు. షాపు లోపలి స్టాల్స్ అన్నీ పగలగొట్టారు. ఇంతలో పోలీసులు రావడంతో డిప్యూటీ మేనేజర్ కాళ్లపై దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. దోపిడికి పాల్పడ్డ దుండగులు జహీరాబాద్ వైపు పారిపోగా.. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు .రెండు రౌండ్లపాటు కాల్పులు జరిపిన దుండగులు.. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దొంగలను పట్టుకునేందుకు సైబరాబాద్ సీపీ 10టీమ్స్ ఏర్పాటు చేశారు. జిల్లాల సరిహద్దుల వద్ద భద్రతను పటిష్టం చేశారు.

షాప్ తెరిచిన ఐదు నిమిషాల్లోనే ఈ గ్యాంగ్ దోపిడి యత్నించింది. సంఘటనాస్థలాన్ని సీపీ అవినాష్ మహంతి పరిశీలించారు. నిందితులను వీలైనంత త్వరంగా పట్టుకుంటామని చెప్పారు. కాల్పుల్లో డిప్యూటీ మేనేజర్‌కు తీవ్ర గాయాలవ్వగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే షాపులో వెండి ఆభరణాలు ఎత్తికెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. అంతకుముందు దుండగులు కూకట్ పల్లిలో రెండు ఇండ్లలో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. నగరంలో ఒక్కసారిగా కాల్పుల మోతతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్