Telangana: ఛీ.. మీరేం మనుషులురా.. ఓ వైపు మృతదేహాలు.. మరోవైపు వీళ్లు ఏం చేశారో చూడండి..

రోడ్డు ప్రమాదం జరిగితే రక్తం ఓడుతున్న ప్రాణాలను కాపాడటం మనిషి నైజం. కానీ అశ్వారావుపేటలో మాత్రం మానవత్వం సిగ్గుతో తలదించుకుంది. ఒకవైపు ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయి, ఘటనా స్థలం మృతదేహాలతో ఉంటే.. కొందరు కేటుగాళ్లు మాత్రం దొంగతనానికి తెగబడ్డారు. దెబ్బతిన్న బండి నుంచి డీజిల్‌ను మాయం చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Telangana: ఛీ.. మీరేం మనుషులురా.. ఓ వైపు మృతదేహాలు.. మరోవైపు వీళ్లు ఏం చేశారో చూడండి..
Diesel Stolen From Lorry After Fatal Accident

Edited By:

Updated on: Apr 25, 2026 | 6:52 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన వెలుగుచూసింది. ఒకవైపు ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయి, ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై ఉంటే.. ఆ విషాదాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు కేటుగాళ్లు తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. ప్రమాదానికి గురైన లారీ నుంచి డీజిల్‌ను దొంగిలించి, మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారిన లారీ యజమాని పరిస్థితి మారింది. ఈ నెల 16న అశ్వారావుపేట సమీపంలోని హైవేపై లారీ-ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ధాటికి లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు కాగా మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు, స్థానికులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్న తరుణంలో.. కొందరు దుండగులు లారీని టార్గెట్ చేశారు.

250 లీటర్ల డీజిల్ మాయం

ప్రమాదంలో లారీ తీవ్రంగా దెబ్బతిని, యజమాని దిక్కుతోచని స్థితిలో ఉండటాన్ని అదునుగా తీసుకున్న కేటుగాళ్లు.. లారీ ట్యాంక్ నుంచి సుమారు 250 లీటర్ల డీజిల్‌ను గుట్టుచప్పుడు కాకుండా మాయం చేశారు. ప్రమాదం జరిగిన రద్దీలో అందరూ బాధితులను కాపాడే పనిలో ఉంటే ఈ దొంగలు మాత్రం డీజిల్ క్యాన్లతో పని పూర్తి చేసుకున్నారు. బండి రిపేరుకు లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని ఆందోళనలో ఉన్న యజమానికి, ఈ దొంగతనం విషయం తెలిసి అవాక్కయ్యాడు.

మానవత్వం ఎటు పోతోంది..?

‘‘ఒకవైపు ప్రాణాలు పోయి విలవిల్లాడుతుంటే, కనీసం జాలి లేకుండా ఇలా దొంగతనాలకు పాల్పడటం తగునా?’’ అని లారీ యజమాని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాల్సింది పోయి, వారి దౌర్భాగ్యాన్ని సొమ్ము చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అశ్వారావుపేటలో చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి, సీసీ టీవీ కెమెరాల ఆధారంగా దుండగులను పట్టుకోవాలని బాధితుడు కోరుతున్నారు.

వీడియో చూడండి..

Follow Us