Hyderabad Robbery: ఎస్ఆర్ నగర్‌లో భారీ చోరీ.. 1 కిలో బంగారం, 22 లక్షల రూపాయలు లూటీ..

Hyderabad Robbery: హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో భారీ చోరీ జరిగింది. ఏకంగా కిలో బంగారం, 22 లక్షల రూపాయల నగదును చోరీ చేశారు..

Hyderabad Robbery: ఎస్ఆర్ నగర్‌లో భారీ చోరీ.. 1 కిలో బంగారం, 22 లక్షల రూపాయలు లూటీ..

Updated on: Jan 13, 2022 | 10:58 PM

Hyderabad Robbery: హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో భారీ చోరీ జరిగింది. ఏకంగా కిలో బంగారం, 22 లక్షల రూపాయల నగదును చోరీ చేశారు దొంగలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్‌లోని సాయి నివాస్ ప్లాట్‌ నెంబర్ 301లో ఎంవిసి శేఖర్ కటుంబం నివాసం ఉంటోంది. అయితే, ఈ నెల 10వ తేదీన శేఖర్ వాళ్ల బంధువు మరణించడంతో అత్యంక్రియల్లో పాల్గొనేందుకు శేఖర్ కుటుంబ సభ్యులంతా ప్రకాశం జిల్లాకు వెళ్లారు. అంత్యక్రియల అనంతరం ఇవాళ మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నారు. ప్లాట్ మెయిన్ డోర్ తెరిచి ఉండటాన్ని గమనించి.. లోపలికి వెళ్లి చూశారు. ఇంటి తలుపు పగలగొట్టి కేజీ బంగారం, 22 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అది గమనించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో దోపిడీ జరిగిన ఇంటిని పరిశీలించారు. 12వ తేదీన అర్థ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి, తాళం పగుల గొట్టి కేజీ బంగారం, ఇరవై రెండు లక్షల నగదు చోరికి గురైనట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Indian Railways: దేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్ ఇది.. దాని వెనుక కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!

Gmailలో ఈ ఫీచర్‌ని ఎప్పుడైనా ఉపయోగించారా.. అందులో నుంచి సీక్రెట్ ఇమెయిల్ పంపవచ్చు తెలుసా..

KTR: కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్‌.. నెటిజ‌న్ కోరిక‌పై మంత్రి ఎలా స్పందించారో తెలుసా.?