NIT Warangal: వరంగల్ నిట్‌లో విద్యార్థుల హవా..రికార్డు స్థాయిలో ప్లేస్‌మెంట్లు

|

Apr 26, 2023 | 9:12 AM

వరంగల్‌ నిట్‌లో విద్యార్థులు రికార్డు స్థాయిలో ప్లేస్‌మెంట్స్‌ను సాధించారు. గతేడిదో పోలిస్తే అత్యధిక ప్యాకేజీతో పాటు ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగింది. ఈ విషయాన్ని నీట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు వెల్లడించారు. 2022-23 విద్యా సంవత్సరంలో 1400 మందికి ఉద్యోగ ఆఫర్లు వచ్చాయని తెలిపారు.

NIT Warangal: వరంగల్ నిట్‌లో విద్యార్థుల హవా..రికార్డు స్థాయిలో ప్లేస్‌మెంట్లు
Warangal Nit
Follow us on

వరంగల్‌ నిట్‌లో విద్యార్థులు రికార్డు స్థాయిలో ప్లేస్‌మెంట్స్‌ను సాధించారు. గతేడిదో పోలిస్తే అత్యధిక ప్యాకేజీతో పాటు ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగింది. ఈ విషయాన్ని నీట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు వెల్లడించారు. 2022-23 విద్యా సంవత్సరంలో 1400 మందికి ఉద్యోగ ఆఫర్లు వచ్చాయని తెలిపారు. దీనికి అదనంగా 450 మంది ఇంటర్న్‌షిప్‌ ఆఫర్లు సైతం అందుకున్నారన్నారు. సీసీపీడీ బీటెక్‌ 82శాతం ప్లేస్‌మెంట్‌ రేట్‌ను సాధించారని, ఏడాదికో విద్యార్థికి అత్యధికంగా రూ.88 లక్షల సీటీసీ (కాస్ట్‌ టు కంపెనీ) ఆఫర్‌ను అందుకున్నట్లు తెలిపారు. గతేడాది కంటే సీటీసీ కూడా భారీగా పెరిగిందన్నారు. సగటు సీటీసీ రూ.17.29 లక్షలు, మధ్యస్థ సీటీసీ రూ.12.6 లక్షలతో ప్లేస్‌మెంట్స్‌ వచ్చాయన్నారు.

అలాగే 2022-23 విద్యా సంవత్సరంలో 270కి పైగా కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించారని, వారిలో 40 శాతం మంది క్యాంపస్‌ను మొదటిసారి సందర్శించినట్లు రమణారావు తెలిపారు. 2021లో-186 కంపెనీలు, 2022లో 221, 2023లో 268 కంపెనీలు వచ్చాయని వివరించారు. ప్రఖ్యాత కంపెనీలు లాభదాయకమైన ప్యాకేజీలతో ఒకే ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో 35మంది విద్యార్థులను నియమించుకున్నట్లు చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, డేటా సైంటిస్ట్‌, డేటా అనలిస్ట్‌ వంటి ఐటీ రంగాల్లో చాలా డిమాండ్‌ ఉన్నాయన్నారు. విద్యార్థుల ప్రాక్టికల్‌ డొమైన్‌ పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి, ప్రస్తుత రిక్రూట్‌మెంట్‌ ఆధారంగా ఇంటర్వ్యూల కోసం వారిని సిద్ధం చేయడానికి కోర్సులు అందిస్తున్నట్లు చెప్పారు. అదనంగా, విభాగాలు, వెలుపలి సంస్థల సహకారంతో సీసీపీడీ కమ్యూనికేషన్‌ సిల్‌-బిల్డింగ్‌ వర్క్‌షాప్, పారిశ్రామిక సందర్శనలు, ఇంటర్న్‌షిప్‌ల వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..