Khammam: గంగమ్మకు మొక్కి వల వేసిన జాలరి.. చిక్కింది చూసి సంబరం..

చేపల వేటకు వెళ్లిన ప్రతిసారి గంగమ్మకు మొక్కుతారు జాలర్లు. తమకు దండిగా జల పుష్పాలు చిక్కాలని వేడుకుంటారు. అయితే కొన్నిసార్లు అదృష్టం కలిసివచ్చి అరుదైన, ఖరీదైన చేపలు చిక్కుతాయి. ఇంకొన్నిసార్లు నిరాశే ఎదురవుతుంది. తాజాగా ఓ జాలరి పంట పండింది ...

Khammam: గంగమ్మకు మొక్కి వల వేసిన జాలరి.. చిక్కింది చూసి సంబరం..
Fishing(representative image)

Updated on: Oct 28, 2025 | 3:40 PM

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి. దీంతో వాగులు, చెరువులు, కాలవలు, జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో చేపల వేట జోరుగా సాగుతుంది. దండిగా జల పుష్పాలు దొరకుతున్నాయి. తాజాగా  ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లో ఓ జాలరి వేసిన వలకు భారీ చేప చిక్కింది. నాయకన్ గూడెం గ్రామానికి చెందిన మేకల పరశురాములు పాలేరు జలాశయంలో చేపల వేటాడి జీవనం సాగిస్తున్నాడు. రోజూ లాగానే చేపల వేటకు వెళ్లిన పరశురాములు వలలో 20 కేజీల భారీ చేప పడింది. ఇలాంటి మీసాల చేపలు జలాశయంలో అరుదుగా లభిస్తాయని పరశురాములు చెపుతున్నాడు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద చేపలు లభించలేదని ఆయన అన్నారు. మీసాల జెల్ల చేప విలువ కేజీ 200 వరకు ఉంటుందని జాలరి తెలిపాడు. ఈ ఒక్క చేపతోనే అతనికి నాలుగు వేల వరకు ముట్టింది.

వీడియో దిగువన చూడండి….