Telangana 2025: తెలంగాణలో రికార్డు స్థాయిలో అవినీతి.. ఈ ఏడాది ఏ శాఖలో ఎక్కువ జరిగిందో తెలిస్తే షాక్.. అస్సలు మాములుగా లేదు..

తెలంగాణలో లంచాలు తీసుకునే అధికారులు పెరిగిపోయారు. ఏసీబీకి పట్టుబడినవారి సంఖ్య గత ఏడాది కంటే ఎక్కువగా ఉండగా.. పట్టుబడనివారు ఇంకెందరో. ఈ ఏడాది ప్రభుత్వ శాఖల్లో అవినీతి భారీగా పెరిగినట్లు ఏసీబీ లెక్కలు చెబుతున్నాయి. కోట్ల కొద్ది లంచం సొమ్ము ఈ ఏడాది ఏసీబీకి పట్టుబడింది.

Telangana 2025: తెలంగాణలో రికార్డు స్థాయిలో అవినీతి.. ఈ ఏడాది ఏ శాఖలో ఎక్కువ జరిగిందో తెలిస్తే షాక్.. అస్సలు మాములుగా లేదు..
Money

Updated on: Dec 26, 2025 | 8:38 AM

తెలంగాణలో అనినీతి భారీగా పెరిగింది. ప్రతీ ఏడాదీ పెరుగుతూనే వస్తుంది తప్ప.. అసలు తగ్గడం లేదు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి తారాస్దాయికి చేరుకుంటోంది. అధికారులు లక్షలు, కోట్లు సంపాదించేందుకు లంచాలకు తెగ అలవాటు పడిపోయారు. లంచం లేనిది ఏ పనికి అనుమతి ఇవ్వడం లేదు. గత ఏడాది కంటే 2025లో అవినీతి మరింతగా పెరిగిపోగా.. లంచగొండి అధికారులు కూడా ఎక్కువ సంఖ్యలో పట్టబడ్డారు. మరో 5 రోజుల్లో ఈ ఏడాది ముగిస్తున్న క్రమంలో.. ఇప్పటివరకు ఎంతమంది అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు..? ఏ శాఖలో ఎక్కువ అవినీతి జరిగింది? అనే వివరాల్లోకి వెళ్తే..

2025లో ఏసీబీ అధికారులు అవినీతి అధికారులకు సంబంధించి ఇప్పటివరకు 220 కంటే ఎక్కువ కేసులు నమోదు చేశారు. 150 మంది అధికారులను కస్టడీలోకి తీసుకున్నారు. 2024లో కేవలం 152 కేసులు మాత్రమే నమోదవ్వగా.. ఈ ఏడాది ఏకంగా 100కిపైగా కేసులు అధికంగా నమోదయ్యాయి. దీనిని బట్టి చూస్తే అవినీతి మరింత పెరిగిపోయినట్లు అర్థమవుతుంది. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వాళ్లే ఈ ఏడాది ఎక్కువమంది ఉన్నారు. ఇక శాఖల్లో అవినీతి విషయానికొస్తే.. ఈ ఏడాది నీటి పారుదల, రెవెన్యూ శాఖల్లో ఎక్కువ లంచం కేసులు నమోదయ్యాయి. బిల్లుల క్లియరెన్స్, భూముల వ్యవహారాలకు సంబంధించి అధికారులు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు ఏసీబీ గణాంకాలు చెబుతున్నాయి.

ఏసీబీ అధికారులు ఈ ఏడాది లంచగొండి అధికారుల నుంచి కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్న అధికారుల గుట్టు బయటపెట్టారు. ఇటీవల రవాణా శాఖలో ఓ అధికారి వద్ద వందల కోట్ల ఆస్తులు ఏసీబీ దాడుల్లో బయటపడ్డాయి. ఇక అక్రమంగా ఆదాయం సంపాదించిన 17 మంది ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేశారు. అటు అవినీతి అధికారులపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏసీబీ అందుబాటులోకి తెచ్చింది. 1064 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపింది. అలాగే వాట్సప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రజలు లంచగొండి అధికారుల గురించి ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్నారు.