AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అయ్యో దేవుడా.. చిన్నారి ప్రాణం తీసిన నీళ్ల బకెట్.. అసలు ఏం జరిగిందంటే?

మైలార్దేవ్‌పల్లిలోలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. వేడి నీళ్ల బకెట్‌లో పడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. తల్లి హీటర్‌కు వేడి నీళ్లు పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: అయ్యో దేవుడా.. చిన్నారి ప్రాణం తీసిన నీళ్ల బకెట్.. అసలు ఏం జరిగిందంటే?
Toddler Dies After Falling Into A Bucket Of Hot Water
Anand T
|

Updated on: Sep 11, 2026 | 10:23 AM

Share

వేడి నీళ్ల బకెట్‌లో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్‌లోని మైలార్దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ఫ్యామిలీ ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి ప్రగతి నగర్లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులతో పాటు నాలుగేళ్ల చిన్నారి మానస కూడా ఉంటుంది. అయితే గురువారం రోజూ స్నానం చేసేందుకని తల్లి బటకెట్‌లో హీటర్ పెట్టింది.

అయితే అదే సమయంలో తల్లికి ఫోన్ రావడంతో ఆమె ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లింది. ఇంతలో ఇంట్లో ఉన్న మానస ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తల్లి పెట్టిన వేడి నీళ్ల బకెట్‌లో పడిపోయింది. నీరు శరీరంపై పడగానే తీవ్ర మంటలో చిన్నారి ఏడవడం స్టార్ట్ చేసింది. చిన్నారి ఏడుపు విన్న తల్లి వెంటనే ఇంట్లోకి వచ్చిన చూడగా బకెట్‌లో పాప కనిపించింది. దీంతో స్థానికుల సహాయంతో పాపను వెంటనే హాస్పిటల్‌కు తరలించింది తల్లి. కానీ అక్కడికి వెళ్లినా ఎలాంటి లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ చిన్నారికి పాణ్నాలు కోల్పోయింది.

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో హీటర్ వాడడం ఎంత ప్రమాదమో మరోసారి ఈ ఘటన నిరూపించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us