AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దూరవిద్య ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌.. UG, PG, డిప్లొమా వరకు అడ్మిషన్లు

డా బిఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి దూరవిద్యలో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణలోని అధ్యయన కేంద్రాల ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 30, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దూరవిద్య ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌.. UG, PG, డిప్లొమా వరకు అడ్మిషన్లు
Dr BR Ambedkar Open University Admissions
Srilakshmi C
|

Updated on: Sep 11, 2026 | 7:32 AM

Share

డా బిఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి దూరవిద్యా విధానంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ అధ్యయన కేంద్రాల ద్వారా విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబరు 30, 2026 చివరి తేదీగా వర్సిటీ ప్రకటించింది. బీఏ, బీకాం, బీఎస్సీ యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అలాగే ఎంఏలో జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ తదితర కోర్సులు ఉన్నాయి. అలాగే ఎంబీఏ, ఎంబీఏ హెచ్‌హెచ్‌సీఎం కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్సీలో మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ కోర్సులు ఉన్నాయి. వీటితో పాటు ఎంకాం, ఎంఎల్‌ఐఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ ప్రోగ్రామ్‌లలోనూ ప్రవేశాలు ఉంటాయి.

డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు

డిప్లొమా ప్రోగ్రామ్‌లలో మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఆపరేషనల్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, జెండర్ స్టడీస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, డిజిటల్ జర్నలిజం, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ తదితర కోర్సులు ఉన్నాయి. సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్‌జీవోస్ మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ ప్రోగ్రామ్‌ల వ్యవధి మూడేళ్లు, పీజీ ప్రోగ్రామ్‌లకు రెండేళ్లు ఉంటుంది. ఎంఎల్‌ఐఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ, డిప్లొమా ప్రోగ్రామ్‌ల వ్యవధి ఏడాది, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ల వ్యవధి ఆరు నెలలు ఉంటుంది.

కోర్సును బట్టి అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత కోర్సుకు నిర్దేశించిన విద్యార్హతలను కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2026-27 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 30, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం సంబంధిత అధ్యయన కేంద్రాన్ని సంప్రదించవచ్చు. అలాగే 040-23680222 / 333 / 444 / 555, 7382929570 నంబర్లకు లేదా టోల్‌ఫ్రీ 18005990101కు సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దూరవిద్య ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us