
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీహిల్స్‌లో ఓ క్రూర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు భర్త. గర్భవతైన భార్యను చంపిన అనంతరం శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేశాడు. తలతో పాటు కొన్ని శరీరభాగాలను కవర్‌లో పెట్టి పడేయడానికి సిద్ధమయ్యాడు. గదిలో శబ్దాలు విని పొరుగువారు వెళ్లి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే కామారెడ్డిగూడకు చెందిన జ్యోతి, మహేందర్‌రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ నెల క్రితం బోడుప్పల్‌కు వచ్చి శ్రీనివాసనగర్‌లో నివసిస్తున్నారు. మహేందర్‌రెడ్డి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గర్భవతిగా ఉన్న భార్య జ్యోతిని గృహకలహాల నేపథ్యంలో హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే వెళ్లి నిందితుడు మహేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బయట ఏమైనా శరీర భాగాల పడేశాడా అని పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనతో మృతురాలు జ్యోతి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. నిందితుడి తల్లిదండ్రులు, బంధువులు చెప్పిమరి తన బిడ్డను చంపేశారని ఆరోపిస్తోంది. వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తోంది. నిందితుడు మహేందర్‌రెడ్డి ప్రవర్తన వింతగా ఉండేదని చెప్తున్నారు స్థానికులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..