AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ ఫక్కీలో దారి దోపిడీ..3 కార్లతో ఛేజ్ చేసి మరీ..

ఆదిలాబాద్‌ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ కారులో వజ్రాలు ఉన్నాయని భావించిన దుండగులు మూడు కార్లతో వెంబడించారు. సినీ ఫక్కీలో కారును వెంబడించి అందులో ఉన్నవారిని భయభ్రాంతులకు గురిచేశారు. తుపాకులతో బెదిరించి కారును ఎత్తుకెళ్లారు. తీరా అందులో ఏమీ దొరక్కపోవడంతో కారును ధ్వంసం చేసి వెళ్లిపోయారు. బాధితులు గుడిహత్నూర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు పరిశీలించగా.. గుజరాత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి వద్ద పని చేసే […]

సినీ ఫక్కీలో దారి దోపిడీ..3 కార్లతో ఛేజ్ చేసి మరీ..
Anil kumar poka
|

Updated on: Dec 19, 2019 | 4:20 PM

Share
ఆదిలాబాద్‌ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ కారులో వజ్రాలు ఉన్నాయని భావించిన దుండగులు మూడు కార్లతో వెంబడించారు. సినీ ఫక్కీలో కారును వెంబడించి అందులో ఉన్నవారిని భయభ్రాంతులకు గురిచేశారు. తుపాకులతో బెదిరించి కారును ఎత్తుకెళ్లారు. తీరా అందులో ఏమీ దొరక్కపోవడంతో కారును ధ్వంసం చేసి వెళ్లిపోయారు. బాధితులు గుడిహత్నూర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు పరిశీలించగా..
గుజరాత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి వద్ద పని చేసే ఇద్దరు వ్యక్తులు కారులో హైదరాబాద్‌ వెళ్తున్నారు. అయితే, వీరి కారులో వజ్రాలు ఉన్నాయని భావించిన గుర్తు తెలియని వ్యక్తులు వారిని వెంబడించారు. కారును ఆపి తుపాకులతో బెదిరించి కారులో ఉన్నవారిని అక్కడే దించేశారు. అనంతరం అదే కారులో అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల కారుని మహారాష్ట్రకు తీసుకెళ్లి అందులోని డైమండ్ లాకర్లను తెరిచారు. కారును ధ్వంసం చేశారు. ఏమీ లభించకపోవటంతో కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు మూడు ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు చేపట్టగా మహారాష్ట్రలోని యావత్‌మాల్‌ జిల్లా వారాకౌఠ వద్ద కారు దొరికింది. ఉట్నూరు పోలీసులు కారును స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
Video: షాపులో వింత కస్టమర్.. మొసలిని చూసి హడలిపోయిన జనం!
Video: షాపులో వింత కస్టమర్.. మొసలిని చూసి హడలిపోయిన జనం!
ఆకాశంలో ఉన్న సూర్యుడిని తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
ఆకాశంలో ఉన్న సూర్యుడిని తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
ఓపెనర్ నుంచి టెయిలెండర్ వరకు వన్డేల్లో ఈ రికార్డులు ఎవరివో తెలుసా
ఓపెనర్ నుంచి టెయిలెండర్ వరకు వన్డేల్లో ఈ రికార్డులు ఎవరివో తెలుసా
రూ.149కే ఆన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్లు.. దీపావళి వేళ శుభవార్త
రూ.149కే ఆన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్లు.. దీపావళి వేళ శుభవార్త
కొత్త ఏడాది నుంచి రైల్వేలో భారీ మార్పులు.. ఈ రైళ్లలో డబ్బులు ఆదా
కొత్త ఏడాది నుంచి రైల్వేలో భారీ మార్పులు.. ఈ రైళ్లలో డబ్బులు ఆదా
వాచ్ పోగొట్టుకున్న కింగ్ కోహ్లీ.. అంపైర్ చేసిన పనికి ఫిదా..!
వాచ్ పోగొట్టుకున్న కింగ్ కోహ్లీ.. అంపైర్ చేసిన పనికి ఫిదా..!
Videos: చెత్తబుట్టలో ట్రంప్.. AI మీమ్స్‌తో నెటిజన్ల సెటైర్లు!
Videos: చెత్తబుట్టలో ట్రంప్.. AI మీమ్స్‌తో నెటిజన్ల సెటైర్లు!
అలాంటి వాళ్లు ఎవరైనా ఉంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి
అలాంటి వాళ్లు ఎవరైనా ఉంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? గోవా కాలేజీలో ఈ కోర్సు చదవండి!
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? గోవా కాలేజీలో ఈ కోర్సు చదవండి!
భార్యతో విడాకులపై స్పందించిన టాలీవుడ్ విలన్..
భార్యతో విడాకులపై స్పందించిన టాలీవుడ్ విలన్..