బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీసుకు బయల్దేరి వెళ్లారు. న్యాయవాదులతో చర్చించిన అనంతరం నందినగర్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో ACB నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణకు ఆయన హాజరయ్యేందుకు బంజారాహిల్స్ ACB ఆఫీస్‌కు వెళ్లారు. ఆ సమయంలో కేటీఆర్ పక్కన అడ్వకేట్ ఉండటంతో.. పోలీసులు ఆయన కారును గేటు వద్ద ఆపారు. అయితే అడ్వకేట్లతోనే లోపలకి వెళ్తానని.. వారి సమక్షంలోనే విచారణ జరగాలన్నారు కేటీఆర్. అడ్వకేట్లను అనుమతించబోమని ఏసీబీ అధికారులు చెప్పారు. అలా కోర్టు ఆర్డర్‌లో లేదన్నారు. ఈ క్రమంలో అధికారుల రెస్పాన్స్ కోసం అరగంట పాటు ఆఫీసు గేటు బయటే వేచి చూసిన కేటీఆర్.. ఏసీబీ అడిషినల్ ఎస్పీకి తన వివరణ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కేటీఆర్‌ను ఫార్ములా-Eరేస్ కేస్ వెంటాడుతోంది. ఒకవైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ.. నోటీసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్. సోమవారం తమ ముందు హాజరుకావాలని ఏసీబీ ఆదేశిస్తే.. మంగళవారం విచారణకు రావాలని నోటీసులిచ్చింది ఈడీ.
ఆ 55 కోట్ల చుట్టూనే ఇప్పుడు పంచాయితీ..! పాలనాపరమైన అనుమతుల్లేకుండా అంత మొత్తం ఫారిన్ కంపెనీకి ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారు.. అది కూడా డాలర్లలో ఎందుకిచ్చారు..! ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. ఆగమేఘాలపై ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక సూత్రధారులెవరు..! ఇదే తేల్చనుంది ACB.
అసలు, కేటీఆర్‌పై ఈడీ మోపిన అభియోగాలు ఏంటి?. ఏ కారణాలు చూపుతూ కేసు నమోదు అయ్యిందో ఒకసారి తెలుసుకుందాం.