MP Vijaysai Reddy High Court Petition: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తొలుత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌కు సంబంధించిన కేసులను విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మొదట సీబీఐ కేసులు.. లేదంటే సీబీఐ, ఈడీ రెండు కేసులూ సమాంతరంగా విచారించేలా ఆదేశాలివ్వాలని విజయ సాయిరెడ్డి హైకోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో హైకోర్టు సైతం విజయసాయిరెడ్డి వాదనలను తోసిపుచ్చుతూ సీబీఐ కోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. మరోవైపు, ఇదే అంశంపై జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్లనూ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
Read Also…
Gas Subsidies: కేంద్ర సర్కార్ గ్యాస్ సిలిండర్లపై అందించిన గ్యాస్ సబ్సిడీ ఎంతో తెలుసా..?