శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు షాక్..విచారణకు ఆదేశించిన హైకోర్టు

|

Dec 19, 2019 | 8:12 PM

శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ రెండు సంస్థలపై వెంటనే విచారణ జరపాలని ఇంటర్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు కాలేజీల యాజమాన్యాలు అనేక నిబంధనలను గాలికి వదిలేసి..విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే కాకుండా, పేరెంట్స్ నుంచి ఫీజుల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నాయంటూ మేడిపల్లికి చెందిన రాజేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అంతేకాదు కాలేజీల్లో విద్యార్థులకు ఉండాల్సిన కనీస సదుపాయాలను ఏవీ కూడా సదరు విద్యాసంస్థల్లో […]

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు షాక్..విచారణకు ఆదేశించిన హైకోర్టు
Follow us on

శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ రెండు సంస్థలపై వెంటనే విచారణ జరపాలని ఇంటర్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు కాలేజీల యాజమాన్యాలు అనేక నిబంధనలను గాలికి వదిలేసి..విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే కాకుండా, పేరెంట్స్ నుంచి ఫీజుల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నాయంటూ మేడిపల్లికి చెందిన రాజేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అంతేకాదు కాలేజీల్లో విద్యార్థులకు ఉండాల్సిన కనీస సదుపాయాలను ఏవీ కూడా సదరు విద్యాసంస్థల్లో ఉండటంలేదని ఆయన ఆధారాలను కోర్టుకు సమర్పించారు.  ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం..లోతైన విచారణ జరిపి, నాలుగు వారాల్లోగా పూర్తి నివేదికను అందజేయాలని ఇంటర్ బోర్డుకు మార్గనిర్దేశకాలు జారీ చేసింది.