అతనో ఆటో డ్రైవర్ కుమారుడు. కానీ మంచి పర్వతారోహకుడు. పేదరికం వెంటాడుతున్నా తన అభిరుచిని, ఆసక్తిని మానుకోలేదు. కిలిమంజారో, కొజియాస్కీ మౌంటెరెనాక్ వంటివి అధిరోహించడం ఏ కాకుండా తన అసలు లక్ష్యం.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం. అందుకు తగ్గట్టు శ్రమించాడు.. ఎవరెస్ట్ ఎక్కి జాతి పతాకాన్ని రెపరెప లాడించాడు. అంతటి ఘనుడు ఇప్పుడు కిరాణా షాప్ పెట్టుకుని దీనావస్థలో కాలం వెళ్లదీస్తున్నాడు.
వికారాబాద్ జిల్లా నవ పేట మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి.. చిన్నప్పటి నుంచీ తిరుపతిరెడ్డికి పర్వతారోహణమంటే ఎంతో ఇష్టం. భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో చేరారు. ప్రొఫెషనల్ మౌంటనీర్ శేఖర్‌బాబు వద్ద శిక్షణ పొందారు. ఎత్తయిన గుట్టలు ఎలా ఎక్కాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలన్నీ తెలుసుకున్నారు. భువనగిరిగుట్టను తిరుపతిరెడ్డి తొలి ప్రయత్నంలోనే అధిరోహించి.. పర్వతారోహణకు బాటలు వేసుకున్నారు. అలా క్రమక్రమంగా కిలిమంజారో, కొజియాస్కీ మౌంటెరెనాక్ సైతం అధిరోహించాడు.. ఎవరెస్టు శిఖరాన్ని అధరోహించడం లక్ష్యంగా పెట్టుకుని 2019లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు ఆనాడు దేశం మొత్తం తిరుపతిరెడ్డిని అభినందించారు.
నాడు దేశం మొత్తం అభినందించింది.. నేడు తిరుపతి రెడ్డి జీవితమే ప్రశ్నర్ధకంగా మారింది. ఎవరెస్టు ను అధిరోహించిన తిరుపతి రెడ్డి జీవితం దీనావస్థలో ఉంది. ప్రస్తుతం అతను తన స్వగ్రామంలో కిరాణా షాపును పెట్టుకొని జీవితాన్ని వెల్లదిస్తున్నాడు. ఇక్కడ ఆశ్చర్య పడాల్సిన విషయమేంటంటే ఆ కిరాణా షాప్ కి సైతం ఎవరెస్టు కిరాణా షాప్ అని పేరు పెట్టి నడిపిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం మెడికల్ షాపు ను నడిపించిన తిరుపతి రెడ్డి అందులో నష్టాలు రావడంతో అనంతరం సొంత గ్రామంలోనే కిరాణా షాపు ను పెట్టుకొని నడిపిస్తున్నాడు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం అంత సులువు కాకపోయినా నాడు అభినందించిన వారు నేడు అతని విస్మరించారు.
ప్రభుత్వం పట్టిచుకోకపోవడం, ప్రభుత్వం నుండి ఆశించిన సహాయం లేకపోవడం తో కిరాణా షాపు ను పెట్టుకొని బ్రతుకుతున్నాను అంటున్నాడు తిరుపతి రెడ్డి.. తండ్రి ఆటో డ్రైవర్ గా పని చేస్తూ.. ఉన్న వ్యవసాయం చేసుకొని జీవినాన్ని కొనసాగిస్తు ముందుకు వెళ్తున్నాను అంటున్నాడు ఎవరెస్టు అధిరోహించిన తిరుపతి. నాన్న ఆటోడ్రైవర్. అయన కూడా అనారోగ్యంతో .ఉండటంతో కుటుంబం గడవడటమే గగనంగా మారింది..ప్రభుత్వం తనకు ఆదుకోవాలని కోరుతున్నాడు తిరుపతి రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..