Telangana: ఆహా.! ఎంతటి శుభవార్త చెప్పారండీ.. వచ్చే 2 రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

వచ్చే 24 గంటల్లో నికోబార్ దీవుల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

Telangana: ఆహా.! ఎంతటి శుభవార్త చెప్పారండీ.. వచ్చే 2 రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
Telangana Rains

Updated on: May 12, 2025 | 9:05 PM

వచ్చే 24 గంటల్లో నికోబార్ దీవుల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండమాన్‌లో కొనసాగుతున్న వర్షాకాలం కారణంగా రేపు 2025 మే 13న నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతం, అండమాన్ – నికోబార్ దీవులలో ప్రవేశించే అవకాశం ఉందట. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతం మరికొన్ని ప్రాంతాలు మొత్తం అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం, అలాగే మధ్య బంగాళాఖాతంలోని కొంత భాగంలో రుతుపవనాల మరింత పురోగతికి అనుకూలమైన పరిస్థితులు వచ్చే 4–5 రోజుల్లో ఏర్పడే అవకాశముంది.

ఇది వర్షాకాల సమయంలో ప్రవేశాన్ని సూచించే కీలకమైన దశగా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల చివరి వారంలో కేరళ తీరాన్ని తాకనున్నాయి రుతుపవనాలు. ఈ రోజు రాత్రి సమయంలో తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందట.

ఈ రోజు రాత్రి 19 జిల్లాలకు ఎల్లో అలెర్ట్..

రేపు తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందట.

రేపు తెలంగాణలోని 19 జిల్లాలకు ఎల్లో అలెర్ట్..

రేపు తెలంగాణ లోని మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, యు జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉష్ణోగ్రత..

రేపు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ చేశారు. రేపుపై 18 జిల్లాలలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి