Telangana: మరో 2 రోజులు కుండబోత వర్షాలు.. పిడుగులు, ఈదురుగాలులు కూడా.. ఈ జిల్లాలకు.!

తెలంగాణలో విభిన్నమైన వాతావరణం ఉంది. ఒక రోజు ఎండ బాగా కాస్తే.. మరో రోజు వర్షం దంచికొడుతోంది. ఏది ఏమైనా ప్రజలకు మాత్రం ఎండల నుంచి ఉపశమనం దక్కింది. గత రెండ్రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని..

Telangana: మరో 2 రోజులు కుండబోత వర్షాలు.. పిడుగులు, ఈదురుగాలులు కూడా.. ఈ జిల్లాలకు.!
Rains
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 10, 2024 | 3:30 PM

తెలంగాణలో విభిన్నమైన వాతావరణం ఉంది. ఒక రోజు ఎండ బాగా కాస్తే.. మరో రోజు వర్షం దంచికొడుతోంది. ఏది ఏమైనా ప్రజలకు మాత్రం ఎండల నుంచి ఉపశమనం దక్కింది. గత రెండ్రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. తమిళనాడులో ద్రోణి ఏర్పడి అది తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని.. ముఖ్యంగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని అంచనా వేశారు. శుక్రవారం నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, అసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

కాగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్న సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్నారు. పిడుగులు ఎప్పుడు, ఎక్కడ ప‌డ‌తాయో ముందే అంచ‌నా వేసి.. వాతావరణ శాఖ అలెర్ట్ ఇస్తుందని.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని చాలా వ‌ర‌కు త‌గ్గించొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ