Hyderabad Rains: తడిసి ముద్దవుతున్న భాగ్యనగరం.. మరో నాలుగు రోజుల పాటు ఇంతే..

|

Sep 07, 2022 | 5:21 PM

Telangana Weather: వానలు ఇక తగ్గాయని అనుకునేలోపే అన్ని ఏరియాల్లో వర్షం దంచికొడుతోంది. నాన్‌స్టాప్‌ వర్షంతో రహదారులపై మోకాళ్ల లోతు..

Hyderabad Rains: తడిసి ముద్దవుతున్న భాగ్యనగరం.. మరో నాలుగు రోజుల పాటు ఇంతే..
Bengaluru Rains
Follow us on

అప్పుడే ఎండ.. అంతలోనే వాన.. భారీ వర్షంతో భాగ్యనగరం తడిసిముద్దయింది. వానలు ఇక తగ్గాయని అనుకునేలోపే అన్ని ఏరియాల్లో వర్షం దంచికొడుతోంది. నాన్‌స్టాప్‌ వర్షంతో రహదారులపై మోకాళ్ల లోతు వరద పారుతోంది. పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, సరూర్‌నగర్‌, బాలనగర్‌, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, సూరారం ప్రాంతాల్లో భారీ వర్షం ముంచేస్తోంది. రెండు రోజులుగా ఏదో సమయంలో కురుస్తున్న వాన ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ఏరియాల్లో గ్యాప్‌ ఇస్తున్న వాన.. మరికొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తోంది. స్కూల్‌ నుంచి ఇళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు.

ఇదిలావుంటే.. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీచేసింది. ఇప్పటికే మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, గద్వాల జిల్లాల్లో అక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. గురువారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం