Rains in Hyderabad: నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు జంట నగరాలైన సికింద్రాబాద్ , హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అమీర్ పేట్ , పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ప్రాంతాలతో సహా సికింద్రాబాద్ భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వరద నీరు ఏరులై పారుతుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యయింది. పలుచోట్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్ ఎంసీ అధికారులు సహాయక చర్యలను చేపట్టారు.
తాజాగా, తెలంగాణపై 2.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఏర్పడింది. రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నాయి. ఈ క్రమంలో రాగాల రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో అత్యధికంగా వెల్దండ(నగర్‌కర్నూల్ జిల్లా)లో 4.8 సెంటిమీటర్ల వర్షపాతం, వెలిజాల(రంగారెడ్డి)లో 3.8 సెంటిమీటర్లు, చలకుర్తి(నల్గొండ)లో 3.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also Read: Atukula Laddu: బూందీ లడ్డూకి తీసిపోని టేస్ట్ దీని సొంతం.. ఈజీగా టేస్టీగా అటుకుల లడ్డూ తయారీ విధానం