హైదరాబాద్‌లో భారీ వర్షం…లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది. గురువారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో ప్రధాన రహదారులు వరద కాలువులను తలపించాయి. లోతట్టు ప్రాంతలన్నీ నీట మునిగాయి. వరద నీరు ఇంటిలోకి రావడంతో లోతట్టు ప్రాంతాల జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాగల 24 గంటల్లో పలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, కోస్తాంధ్ర, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో విస్తరించే అవకాశం […]

హైదరాబాద్‌లో భారీ వర్షం...లోతట్టు ప్రాంతాలు జలమయం

Updated on: Jun 12, 2020 | 5:15 AM

హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది. గురువారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో ప్రధాన రహదారులు వరద కాలువులను తలపించాయి. లోతట్టు ప్రాంతలన్నీ నీట మునిగాయి. వరద నీరు ఇంటిలోకి రావడంతో లోతట్టు ప్రాంతాల జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రాగల 24 గంటల్లో పలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, కోస్తాంధ్ర, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వలన అల్పపీడనం ఏర్పడిందన్నారు. రాగల 24గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి అల్పపీడనం బలపడే అవకాశం ఉందని తెలిపింది.