Chicken: వరణుడి ఎఫెక్ట్.. ఆ ఊరంతా కోడికూర జాతరే.. అసలు మ్యాటర్ తెలిస్తే అయ్యో పాపం అంటారు..

Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Chicken: వరణుడి ఎఫెక్ట్.. ఆ ఊరంతా కోడికూర జాతరే.. అసలు మ్యాటర్ తెలిస్తే అయ్యో పాపం అంటారు..
Hens
Follow us

|

Updated on: Sep 08, 2021 | 6:18 AM

Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎటు చూసినా రోడ్డు కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. చిన్నా చితకా వాగులు వంకలు అన్నీ పొంగి పొర్లుతున్నాయి. అయితే ఈ భారీ వర్షాల ఎఫెక్ట్ కారణంగానే నిజామాబాద్ జిల్లాలోని చింతలూరు గ్రామస్తులు కోడి కూరతో సంతోషంగా దావత్ చేసుకుంటున్నారు. కిలోల చొప్పున కాకుండా ఏకంగా డజన్ల కొద్ది కోళ్లను పట్టుకొళ్లి పండగ చేసుకుంటున్నారు. అదీ ఉచితంగా. ఉచితంగా కోళ్లు ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. మీరు విన్నది నిజమే..! దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కుంటలు, చెరువులు నిండిపోయి అలుగు పారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జాక్రాన్ పల్లి మండలం చింతలూరులో భారీ వర్షాలకు దరకాసు చెరువు ఉప్పొంగుతోంది. చెరువు నిండి మత్తడి పారుతోంది. అయితే, చెరువు పక్కనే ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫాం ఉంది. ఆ నీటి ప్రవాహంతో కోళ్ల ఫాం నీట మునిగిపోయింది. ఫారంలో ఉన్న కోళ్లు వరద ప్రవాహానికి పక్కనే ఉన్న పొలాలు, గ్రామాల్లోకి కొట్టుకుపోయాయి. మిగిలిన కోళ్లను స్థానిక ప్రజలు వచ్చి పట్టుకెళ్లారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా డజన్ల కొద్ది కోళ్లను పట్టుకుపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లు.. ఓవైపు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తుంటే.. మరోవైపు జనాలు కోడి కూరతో పండుగ చేసుకుంటున్నారు.

Also read:

Telangana Rains: తెలంగాణపై వరణుడి ప్రతాపం.. జలదిగ్బంధంలో లక్నవరం కేబుల్ బ్రిడ్జి..

Wonder Kid: చిన్నాడో కాదు.. చిచ్చర పిడుగు.. ఒక్కసారి తెలిసిందంటే ఇక అంతే..

Traffic Challan: టీవీ9 ఎఫెక్ట్.. ట్రాఫిక్‌ చలాన్లపై స్పందించిన జనగామ కలెక్టర్‌.. పెండింగ్ చలాన్లు క్లియర్..!