AP – Telangana: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షసూచన

|

Jun 25, 2023 | 1:56 PM

మండే ఎండలకు ఇక చెక్ పడినట్లే. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వెల్లడించింది.

AP - Telangana: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షసూచన
Rain Alert
Follow us on

ఇన్ని రోజులు మండే ఎండలతో..అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని వార్త ఇది. రుతుపవనాలు లేటుగా వచ్చినా..లేటెస్టుగా కుంభవృష్టి తప్పదని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ. రాబోయే మూడు రోజులు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతంలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో.. ఇవాళ, రేపట్లో అదే ఏరియాలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా ఉండనుంది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో రెండు, మూడు రోజులుపాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ స్పష్టం చేసింది. కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు  కురిసే సూచనలున్నాయని చెబుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..