Harish Rao: ఎన్నికలు కాగానే బీజేపీ నిజస్వరూపం బయటపడింది.. మంత్రి హరీష్ రావు షాకింగ్ కామెంట్స్..
Harish Rao slams BJP: తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. కేంద్రం వైఖరిపై టీఆర్ఎస్.. రాష్ట్రం వైఖరిపై బీజేపీ మాటలతూటాలు పేల్చుతున్నాయి. తాజాగా.. కేంద్రంలో అధికారంలో

Harish Rao slams BJP: తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. కేంద్రం వైఖరిపై టీఆర్ఎస్.. రాష్ట్రం వైఖరిపై బీజేపీ మాటలతూటాలు పేల్చుతున్నాయి. తాజాగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు మరోసారి ధ్వజమెత్తారు. దేశంలో మళ్లీ ధరలు మండిపోవడానికి కారణం బీజేపీ వైఖరే అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు సామాన్య ప్రజలకు పెనుభారంలా మారాయంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిత్యావసరాల ధరలు కూడా రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా ప్రభావంతో ఆదాయం లేక అల్లాడుతున్న ప్రజలను అధిక ధరలు అప్పులపాలు చేస్తున్నాయన్నారు.
అయితే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక బీజేపీ నిజస్వరూపం మరోసారి వెల్లడైందని హరీశ్ రావు విమర్శించారు. ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాయితీలను భరించాల్సిన కేంద్రం రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతోందంని హరీశ్‌రావు బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇదిలాఉంటే.. శనివారం ఉదయం హరీశ్ రావు సతీసమేతంగా శ్రీశైలం పుణ్య క్షేత్రానికి చేరుకొని మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Also Read:
