AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో మోపయ్యారు పచ్చి నకిలీగాళ్లు..!

ఖరీఫ్ సీజన్ మొదలవ్వగానే నకిలీ ఎరువులు, విత్తనాల మాఫియా మళ్ళీ విజృంభిస్తోంది. తీవ్ర వర్షాభావం, ఎల్‌నినో ప్రభావంతో అల్లాడుతున్న రైతును ఈ నకిలీల దందా మరింత నట్టేట ముంచుతోంది. పర్మిట్లు, పెద్దగా పెట్టుబడులు లేకుండానే రేకుల షెడ్లలో ఉప్పు, ఎర్ర రంగు రసాయనాలు, మట్టి కలిపి నకిలీ DAP ఎరువులను తయారు చేసి బ్రాండెడ్ సంచుల్లో ప్యాక్ చేస్తున్నారు. సూర్యాపేట, పెద్ద అంబర్‌పేట్, పాలమూరు, నాగర్‌కర్నూల్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పట్టుబడిన నకిలీ DAP బస్తాలు ఈ దందా విస్తరణకు అద్దం పడుతున్నాయి.

వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో మోపయ్యారు పచ్చి నకిలీగాళ్లు..!
Fake Dap Fertilizer Scam
Jyothi Gadda
|

Updated on: Jul 24, 2026 | 9:55 PM

Share

పెద్దగా పర్మిట్లు, రిజిస్ట్రేషన్‌లు అక్కర్లేదు, కోట్లకొద్దీ పెట్టుబడులతో పనిలేదు. ఒక చిన్న షెడ్డు, కొన్ని మిక్సింగ్ మిషన్లు, నాలుగైదు గోనె సంచులు, రంగురంగుల ఫేక్ స్టిక్కర్లు ఉంటే చాలు. కోట్ల రూపాయల నకిలీ DAP ఈజీగా తయారవుతుంది. పక్కా ఒరిజినల్‌గా మార్కెట్లో చెలామణీ అవుతుంది. రైతు జేబుల్ని ఖాళీ చేస్తుంది. పంటను తినిపారేస్తుంది. వీళ్లు మాత్రం ఓవర్‌నైట్‌లో కోటీశ్వరులైపోవచ్చు. ఇలా రైతును నట్టేట ముంచే నకిలీ ఎరువుల తయారీ కర్మాగారాలు తెలంగాణ గల్లీల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని తెలుసా? టౌన్లో కుటీరపరిశ్రమలుగా కలరింగ్ ఇచ్చుకుంటూ, పల్లెల్లో వాలిపోయి, పంటభూముల్లో విషం చిమ్ముతోంది నకిలీ ఎరువుల దందా. అసలే తడికి నోచుకోని నారుమళ్లు రైతుకు కడగండ్లుగా మారిపోయాయి. దానికితోడు, నకిలీల పేరుతో ఇంకో వెన్నుపోటు రెడీగా ఉంది. నకిలీ ఎరువులు తయారుచేయుట ఎలా? అదికూడా అవలీలగా, అత్యంత చౌకగా. కొనే రైతుకే కాదు అమ్మే వ్యాపారస్థుడికే తెలీనంతలా, పట్టుకున్న పోలీసులే షాకయ్యేంతలా..! కోళ్లఫారంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న నకిలీ DAP తయారీ. ఇది చిన్న కథకాదు. బ్రాండెడ్ స్టిక్కర్ల వెనుక నక్కిన నకిలీ ఎరువుల దందాల్లో మచ్చుకు ఇది ఒక్కటి మాత్రమే. సూర్యాపేట జిల్లాలో నకిలీ డీఏపీ అమ్మకాల తీగలాగితే హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట్‌లో కదిలింది డొంక. ఏడుగుర్ని లోపలేసిన పోలీసులు, పరారైన మాస్టర్‌మైండ్‌ కోసం వెతుకుతున్నారు. ఇక్కడే మిక్సింగ్, ఇక్కడే ప్యాకింగ్, ఇక్కడే లోడింగ్. గ్రోమోర్, కోరమండల్, అన్నపూర్ణ.. అన్నీ పేరుమోసినబ్రాండ్లే. కానీ, ఈ పేరున్న...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి