తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పాఠశాలలకు రేపట్నుంచి (మార్చి 15) ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మార్చి 13న ఉత్తర్వులు జారీచేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మధ్యాహ్న భోజనం అందించి పిల్లలను ఇంటికి పంపాలి తెలిపారు. కాగా ప్రతీయేట మాదిరి ఈ ఏడాది కూడా మర్చి 15 నుంచి పాఠశాలలకు విద్యాశాఖ ఒంటిపూట బడులు ప్రారంభించింది.
పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 3 నుంచి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నందున ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు కొనసాగించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.