Guns seized: ఒకప్పుడు ఉన్న నాటు తుపాకులు ఇటీవల కాలం నుంచి పెద్దగా కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే నాటు తుపాకులు ఈ మధ్య కాలంలో కనుమరుగయ్యాయి. పోలీసుల దాడులతో మచ్చుకైనా కనిపించడం లేదు. అయితే ఈ మధ్య కాలంలో మళ్లీ అక్కడక్కడ గ్రామీణ ప్రాంతాలలో వెలుగు చూస్తుండటం సంచలనం రేపుతున్నాయి. అడవి జంతువుల కోసం వేటాడేందుకు ఉపయోగిస్తుంటారు. పోలీసుల దాడులతో కనుమరుగైన ఈ నాటు తుపాకులు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో నాటు తుపాకాలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని బషీరాబాద్ మండలంలో ఏకాంబ అడవి ప్రాంతంలో జంతువులను వేటాడేందుకు వచ్చిన వేటగాళ్లను టాస్క్ ఫోర్స్, బహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు నాటు తుపాకులతో పాటు 9 మొబైళ్లు, 5 బైక్‌లను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.
బషీరాబాద్ మండలం ఏకాంబర అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు నాటు తుపాకులతో సంచరిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం సాయంత్రం నుంచి తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సుమారు పది మంది వేటగాళ్లు కనిపించడంతో అరెస్టు చేశారు. ఈ క్రమంలో సుమారు పది మంది వేటగాళ్లు కనిపించడంతో వారిని పట్టుకున్నారు. ఇందులో కొడంగల్ మండలం బోయపల్లి తండాకు చెందిన ఆరుగురు, కర్ణాటకలోని లింగంపల్లి గ్రామానికి చెందిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా అడవి ప్రాంతంలో వేట కోసం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
నాన్నా.. త్వరగా రండి.. నన్ను బయటకు తీయండి.. బస్సు చక్రాల కింద నలిగి.. చికిత్స పొందుతూ మృతి