Rajanna Sircilla district: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ అవినీతి అధికారి బాగోతం వింటే అవాక్కవ్వాల్సిందే. తంగళ్లపల్లి మండలం(thangallapally mandal) తాడూర్(Thadur) ఏఈవో పేరు అజీజ్ ఖాన్. రైతులకు ఏ పనిచేయాలన్నా.. లంచం ఇచ్చుకోవాల్సిందే. రైతుబీమా, రైతుబంధు, పంట వివరాల నమోదు.. ఇలా ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్‌చేసి మరీ రైతులను పీల్చిపిప్పిచేస్తున్నాడు. డబ్బులిస్తే తప్ప పని జరగదంటూ తెగేసి చెబుతున్నాడు. అందుకు ఆన్‌లైన్ పేమెంట్లూ యాక్సెప్టబుల్ అంటున్నాడు. దిగువన వీడియోలో మీరు చూడవచ్చు.. ఆ అధికారి ఏమాత్రం జంకూబొంకు లేకుండా లంచం ఎలా డిమాండ్ చేస్తున్నాడో. ఓ రైతు తనపంటను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు అజీజ్‌ఖాన్‌ను కలిశాడు. అందుకు ఏఈవో 500 రూపాయలు లంచం అడిగాడు. కంగుతిన్న రైతు.. ఇదెక్కడి అన్యాయం సార్.. డబ్బు ఎందుకివ్వాలంటూ అమాయకంగా అడిగాడు. డబ్బు ఇస్తేనే పని.. లేదంటే లేదని ఖరాఖండిగా చెప్పడంతో చేసేదేమీలేక పోన్‌పే ద్వారా ఆన్‌లైన్‌లో పంపించాడు. రైతు సెల్‌ఫోన్‌లో వీడియో తీయడంతో అజీజ్‌ఖాన్ బాగోతం బయటపడింది. ఏఈవోపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు బాధిత రైతు.