Governor Tamilisai: విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చా.. బాసర ట్రిపుల్‌ ఐటీని పరిశీలించిన గవర్నర్‌ తమిళిసై..

Governor Tamilisai: ట్రిపుల్‌ ఐటీలో మెస్‌ను పరిశీలించిన గవర్నర్‌.. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ ఫాస్ట్‌ చేశారు. అనంతరం విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల సమస్యలు..

Governor Tamilisai: విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చా.. బాసర ట్రిపుల్‌ ఐటీని పరిశీలించిన గవర్నర్‌ తమిళిసై..
Governor Tamilisai

Updated on: Aug 07, 2022 | 8:35 AM

బాసర ట్రిపుల్ ఐటీలో పర్యటిస్తున్నారు గవర్నర్‌ తమిళి సై. ట్రిపుల్‌ ఐటీలో మెస్‌ను పరిశీలించిన గవర్నర్‌.. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ ఫాస్ట్‌ చేశారు. అనంతరం విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చానన్న గవర్నర్‌.. అన్ని విషయాలు చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇక అంతకుముందు బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో మీడియాపై పోలీసుల ఆంక్షలపై అసహనం వ్యక్తం చేశారు గవర్నర్ తమిళిసై. మీడియా విధులు నిర్వహిస్తుంటే మీ జోక్యం ఏంటని పోలీసులను ప్రశ్నించారు.

దీంతో ఆదివారం ఉదయం గవర్నర్ బాసర ట్రిబుల్ ఐటీకి చేరుకున్నారు. వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్ కుమార్ ఆమెకు స్వాగతం పలికారు. బాసరా ట్రిపుల్ ఐటీతో పాటు తెలంగాణలోని మిగిలిన వర్సిటీలను సందర్శిస్తానని అన్నారు. తన పర్యటన ఎవరికి వ్యతిరేకం కాదని.. ఇందులో రాజకీయం చూడాల్సిన అవసరం లేదన్నారు. యూనివర్సిటీల్లో సమస్యలపై నిత్యం విద్యార్థుల నుంచి తనకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో గత 2 నెలలుగా విద్యార్థులు పోరాటం చేస్తున్న తనకు తెలుసన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..