Cyber Crime: పార్ట్‌ టైమ్‌ జాబ్‌ కోసం ఆశపడ్డారు.. తీరా చూస్తే, రూ. లక్షలు పోగొట్టుకున్నారు..

వివరాల్లోకి వెళితే.. హైదారబాద్‌ శివారు, సంగ్గారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో నివాసం ఉంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇటీవల పార్ట్‌ టైమ్‌ పేరుతో ఓ మెసేజ్‌ వచ్చింది. దానికి స్పందించిన ఉద్యోగి వెనకా ముందు ఆలోచించకుండా, అవతలి వ్యక్తి అడిగిన వివరాలను ఇచ్చేశాడు. అనంతరం అతడికి ఒక ఐడి క్రియేట్ చేసి ఇచ్చారు....

Cyber Crime: పార్ట్‌ టైమ్‌ జాబ్‌ కోసం ఆశపడ్డారు.. తీరా చూస్తే, రూ. లక్షలు పోగొట్టుకున్నారు..
Cyber Crime

Updated on: Feb 17, 2024 | 7:50 AM

సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. సైబర్ నేరస్థులు రకరకాల మార్గాల్లో డబ్బులను కాజేస్తున్నారు. అయితే ఈ మోసాలకు గురవుతున్న వారు చదుకోని వారా అనుకుంటే పొరబడినట్లే. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా వీరి బారిన పడుతుండడం విస్మయం కలిగిస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌ శివారులోని అమీన్‌పూర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. హైదారబాద్‌ శివారు, సంగ్గారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో నివాసం ఉంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇటీవల పార్ట్‌ టైమ్‌ పేరుతో ఓ మెసేజ్‌ వచ్చింది. దానికి స్పందించిన ఉద్యోగి వెనకా ముందు ఆలోచించకుండా, అవతలి వ్యక్తి అడిగిన వివరాలను ఇచ్చేశాడు. అనంతరం అతడికి ఒక ఐడి క్రియేట్ చేసి ఇచ్చారు. డబ్బులు ఇన్వెస్ట్‌ చేసిన చెప్పిన టాస్క్‌లు చేస్తే కమిషన్‌ ఇస్తామని చెప్పారు. దీంతో ముందుగా రూ. 3 వేలు చెల్లించి వారు ఇచ్చిన టాస్క్‌లు పూర్తి చేశాడు. దీంతో వ్యాలెట్‌లోకి కమిషన్‌ను యాడ్‌ చేశారు.

దీంతో ఇదేదో బాగుందని భావించిన సదరు ప్రభుత్వ ఉద్యోగి విడదల వారీగా ఏకంగా రూ. 59 లక్షలు చెల్లిస్తూ పోయాడు. వ్యాలెట్‌లో అతనికి మొత్తం రూ. 79 లక్షలు వచ్చినట్లు చూపించింది. దీంతో తాను పెట్టిన డబ్బులతో పాటు, కమిషన్‌ను ఇవ్వాలని అడగడంతో సైబర్‌ మోసగాళ్లు ఎంతకీ స్పందించలేదు. చివరికి తాను మోసపోయానని గ్రహించిన ఉద్యోగి గురువారం సైబర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సైతం మోసపోయారు. బీరంగూడలోని మల్లారెడ్డి కాలనీకి చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో పాటు, మరో ప్రైవేట్‌ ఉద్యోగికి కూడా పార్ట్ టైమ్‌ జాబ్‌ పేరుతో ఇలాగే మెసేజ్‌ వచ్చింది. వీరికి కూడా అలాగే వాలెట్ ఐడిని క్రియేట్ చేసి టాస్క్ లు పూర్తి చేస్తే కమిషన్ ఇస్తామని నమ్మబలికారు. దీంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రూ. 2 లక్షలు, ప్రైవేట్ ఉద్యోగి రూ. 18 లక్షలు చెల్లిస్తూ పోయారు. చివరికి మోసపోయామని గ్రహించి స్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..