గోషామహల్ మళ్లీ రాజాసింగ్ కాషాయ జెండా ఎగరేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి నందకుమార్ వ్యాస్‌పై 21,457 ఓట్ల మెజార్టీతో రాజాసింగ్ ఆయన మూడవసారి గెలుపొంది.. హ్యాట్రిక్ కొట్టారు. హైదరాబాద్ మహానగరానికి గుండెకాయలాంటి ప్రాంతం గోషామహల్ (Goshamal Assembly Election). దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తారు. మినీ ఇండియాగా ఈ ప్రాంతాన్ని చెప్పుకోవచ్చు. గోషామహల్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అంతకుముందు ఈ నియోజకవర్గం మహారాజ్ గంజ్ గా ఉండేది. మహారాజ్ గంజ్ 2004లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ గౌడ్ విజయం సాధించారు. 2009లో గోషామహల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ గౌడ్ విజయం సాధించారు. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గం పరిధిలో గోషామహల్, అఫ్జల్ గంజ్, ఆగపూర, బొగ్గులకుంట, దూల్ పేట, రామకోటి, సుల్తాన్ బజార్, మోజాం జాహీ మార్కెట్ తదితర ప్రాంతాలు వస్తాయి. దాదాపుగా మూడు లక్షల మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. 2018లో బిజెపి తెలంగాణ అసెంబ్లీలో గెలిచిన ఏకైక సీటు ఇది. రాజాసింగ్ తన సమీప TRS ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాదోడ్ పై 17734 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తాజాగా మరోసారి గోషామహల్‌లో బీజేపీ జెండా ఎగరేశారు రాజాసింగ్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్