Telangana: తెలంగాణాలో ఇంటర్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న ఉన్నత విద్యామండలి..ఆ విషయంలో నిబంధనలు సడలింపు

|

Mar 05, 2022 | 10:16 AM

Telangana: తెలంగాణలోని ఇంటర్‌ విద్యార్థులకు(Inter Students) ఉన్నత విద్యామండలి చెప్పనుంది. ఇంటర్ ను కనీస మార్కులతో ఉత్తీర్ణులైన స్టూడెంట్స్ ను ఎంసెట్‌(EAMCET) ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని..

Telangana: తెలంగాణాలో ఇంటర్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న ఉన్నత విద్యామండలి..ఆ విషయంలో నిబంధనలు సడలింపు
Inter Students
Follow us on

Telangana: తెలంగాణలోని ఇంటర్‌ విద్యార్థులకు(Inter Students) ఉన్నత విద్యామండలి చెప్పనుంది. ఇంటర్ ను కనీస మార్కులతో ఉత్తీర్ణులైన స్టూడెంట్స్ ను ఎంసెట్‌(EAMCET) ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని నిర్ణయించింది. దీంతో ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ రాసి.. పాసైన ప్రతి ఒక్కరూ ఎంసెట్‌కు అర్హత లభించనుంది. నిజానికి కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా విద్యార్థుల చదువులు, పరీక్షల విషయంలో అనేక నిబంధనలు సడలించారు.

చాలామంది విద్యార్థులు తమకు ఆన్ లైన్ లో క్లాసుల వలన పాఠాలు అర్ధం కాలేదని ఆరోపించారు. గత ఏడాది అక్టోబర్ లో నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో కేవలం 49 శతం మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో ప్రభుత్వం ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేసింది. అయితే ఈ ఏడాది కూడా కరోనా థర్డ్ వేవ్ సమయంలో ఆన్ లైన్ క్లాసులను నిర్వహించింది. గత అనుభవాల దృష్ట్యా ఏడాది కూడా ఇంటర్ లో ఎక్కువ మంది విద్యార్థులు 40 మార్కులు సాధించడం కష్టమనే అంచనాలు తెరమీదకొస్తున్నాయి. దీంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి 35 మార్కులతో పాస్ అయితే చాలు.. ఎంసెట్ ద్వారా సీటు పొందే అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయం గురించి త్వరలో అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఏప్రిల్ లో ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు.  జూన్‌ నెలా ఆఖరులోగా ఎంసెట్‌ తేదీలను ఖరారు చేయాలని భావిస్తోన్నారు.

Also Read:

Ram Charan: మరో వాణిజ్య ప్రకటనలో రామ్ చరణ్.. సీతతో కలిసి ప్రచారం చేయనున్న రామరాజు