గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రకటన.. కొత్త టీమ్ ఇదే..

ఖండంతరాలు దాటినా.. మట్టి వాసన మరువని తెలంగాణ బిడ్డలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రవాస వేదిక గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచ వేదికపై సగర్వంగా చాటిచెప్పే ఈ సంస్థ 2026-27 సంవత్సరానికి సంబంధించి తమ నూతన నాయకత్వ బృందాన్ని అధికారికంగా ప్రకటించింది. వినూత్న ఆలోచనలు, అంకితభావం కలిగిన కొత్త కార్యవర్గ సభ్యులు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీల రాకతో GTA మరింత బలోపేతం కానుంది.

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రకటన.. కొత్త టీమ్ ఇదే..
Global Telangana Association New Committee

Updated on: Feb 06, 2026 | 9:16 AM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేస్తూ, మన సంస్కృతిని, అభివృద్ధిని చాటిచెబుతున్న ప్రతిష్టాత్మక సంస్థ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. ఈ అసోసియేషన్ 2026 – 27 సంవత్సరానికి సంబంధించి తమ నూతన కార్యవర్గాన్ని, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ సమాజం కోసం ప్రపంచవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా ఈ కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఎంతో ఉత్సాహం, అంకితభావం కలిగిన నాయకులు ఈ జట్టులో ఉండటం సంస్థకు మరింత బలాన్ని చేకూరుస్తుందని సంస్థ వ్యవస్థాపకులు విశ్వేశ్వర్ కలవల భావిస్తున్నారు.

నూతన కార్యవర్గం ఇదే..

అసోసియేషన్ చైర్మన్‌గా ప్రవీన్ కేసిరెడ్డి, ప్రెసిడెంట్‌గా బాపురెడ్డి కేతిరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ రవీందర్ గడ్డంపల్లి, వైస్ ప్రెసిడెంట్స్‌గా డాక్టర్ నందిని సుంకిరెడ్డి, మల్లికార్జున్ పదుకొనే, మధు న్యాలపట్ల, ప్రవీణ్ బిల్లా, ప్రవీణ్ సింగిరికొండ ఎన్నికయ్యారు. ఇక జనరల్ సెక్రటరీగా దుష్యంత్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా హరి గక్కని, ట్రెజరర్‌గా సుధీర్ ముద్దసాని, జాయింట్ ట్రెజరర్‌గా వంశీ సింగిరెడ్డి ఎన్నికైనట్లు విశ్వేశ్వర్ కలవల తెలిపారు.

పాత కార్యవర్గానికి ధన్యవాదాలు

గతంలో సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన మాజీ కార్యవర్గ సభ్యులకు విశ్వేశ్వర్ కలవల తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. వారి నిబద్ధత వల్లే GTA నేడు ఈ స్థాయికి చేరుకుందని ఆయన కొనియాడారు. నూతన నాయకత్వ బృందం తమ అనుభవంతో GTAని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించడానికి, కొత్త సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టడానికి దోహదపడుతుందని వ్యవస్థాపకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అందరం కలిసి సంస్థను మరిన్ని విజయాల వైపు నడిపిద్దామని ఆయన పిలుపునిచ్చారు.