AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు.. ఇవి పాటించకపోతే..

హైదరాబాద నగరంలో అప్పుడే వినాయక శోభ మొదలైంది. అయితే గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అత్తాపూర్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉత్సవాలు ప్రశాంతంగా సాగేలా రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని హెచ్చరించారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Hyderabad: గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు.. ఇవి పాటించకపోతే..
Ganesh Navratri Safety
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Sep 01, 2026 | 7:09 PM

Share

గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అత్తాపూర్‌ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజేంద్రనగర్‌ డివిజన్‌ పరిధిలోని అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మొత్తం 72 మంది రౌడీ షీటర్లు ఉండగా వీరిలో దాదాపు 45 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. గణేష్‌ ఉత్సవాల సమయంలో ఎలాంటి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడవద్దని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు వారికి స్పష్టం చేశారు.

ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా.. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. గణేష్‌ ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులకు సహకరించాలని ఆదేశించారు. అలాగే రౌడీ షీటర్లలో ఎవరైనా తమ ప్రాంతం విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే.. ముందుగా సంబంధిత సెక్టార్‌ ఎస్‌ఐకి సమాచారం అందించి అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించినా.. నేరాలకు పాల్పడినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్
తండ్రి కాబోతున్న జబర్దస్త్ ప్రవీణ్.. బ్యూటిఫుల్ వీడియోతో..
తండ్రి కాబోతున్న జబర్దస్త్ ప్రవీణ్.. బ్యూటిఫుల్ వీడియోతో..
విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో.. హోమ్‌ లోను ఉంటే ఎవరు కట్టాలి?
విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో.. హోమ్‌ లోను ఉంటే ఎవరు కట్టాలి?
Video: వావ్.. 5శాతం నీటితో మేడపై 70శాతం కూరగాయల సాగు..
Video: వావ్.. 5శాతం నీటితో మేడపై 70శాతం కూరగాయల సాగు..