Telangana: గద్వాలలో న్యూడ్ కాల్స్ కలకలం.. మాయమాటలతో అమ్మాయిలు, వివాహితలను ట్రాప్‌ చేసిన మాయగాళ్లు

|

Nov 05, 2022 | 1:16 PM

మహిళలను లోబర్చుకుని బ్లాక్‌మెయిల్‌‌కు పాల్పడుతున్న ముఠా బాగొతం గద్వాలలో వెలుగుచూసింది. పదుల సంఖ్యలో అమ్మాయిలను, వివాహితలను ట్రాప్ చేసినట్లు సమాచారం అందుతుంది.

Telangana: గద్వాలలో న్యూడ్ కాల్స్ కలకలం.. మాయమాటలతో అమ్మాయిలు, వివాహితలను ట్రాప్‌ చేసిన మాయగాళ్లు
Honey Trap
Follow us on

గద్వాల గలీజ్‌ కాల్స్‌ వ్యవహరంలో ఇద్దరిపై కేసు నమోదు చేశారు, మహేశ్వర్‌ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మరొక నిందితుడు నిఖిల్‌ కోసం వెతుకుతున్నారు. ఇంకా ఈ న్యూడ్‌ కాల్స్‌ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గద్వాల్‌లో గలీజ్‌ కాల్స్‌ గబ్బులేపుతున్నాయి. యువతులు, మహిళల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఏ కాల్‌లో ఏ రాక్షసుడు ఉంటాడో తెలియని అరాచకం..ఒకడు ప్రేమంటాడు. మరొకడు స్నేహం అంటాడు. ఇంకొకడు జీవితం పంచుకుంటానంటాడు. వేరొకడు లివింగ్‌ రిలేషన్‌ అంటాడు. అన్నింటికీ ఆయుధం అందమైన మాటలే.. నభూతో నభవిష్యత్‌ నటనే.. గద్వాలలో ఇప్పుడిదే జరుగుతోంది..పచ్చని కాపురాలు బుగ్గిపాలవుతున్నాయి. అందమైన జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఇంతకీ ఈ కాల్స్‌ చేస్తున్న వాళ్లెవరు..వాళ్లకు కావాల్సిందేంటి..అసలు వాళ్ల మోడస్‌ ఆపరెండీ ఎలా ఉంటోంది..

సోషల్‌ మీడియాలో పరిచయమవుతున్నారు. అక్కడ ఫోటోలు చూసి చాట్‌ స్టార్ట్‌ చేస్తున్నారు. అలా మెల్లగా పరిచయం పెంచుకుంటారు. నెంబర్లు తీసుకుంటారు. వాట్సాప్‌ చాట్స్‌, వీడియో కాల్స్‌తో మరింత దగ్గరవుతున్నారు. నీకు తోడుంటాను. నిన్ను గుండెల్లో దాచుకుంటాను. ఏలోటు లేకుండా చూసుకుంటాను లాంటి కమ్మని మాటలతో బుట్టలో పడేస్తున్నారు. న్యూడ్‌ కాల్స్‌ చేస్తున్నారు. వాళ్లకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. వీళ్ల మాయలో పడిన అమ్మాయిలు, మహిళలు వాళ్లు చెప్పినట్లే చేస్తున్నారు. పూర్తిగా నమ్మేశాక.. న్యూడ్‌ కాల్స్‌తో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. అప్పుడు అసలైన క్రైమ్‌ సెక్స్‌ కహానీ మొదలవుతుంది.. అదేంటంటే..

తాము చెప్పిన వాళ్లతో గడపాలని..లేకపోతే న్యూడ్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులకు పంపిస్తామని.. మాయగాళ్లు బెదిరిస్తున్నారు. ఇలా బెదిరిస్తున్న వాళ్లలో రాజకీయ నేతలున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు కొంతమంది టీచర్లు, కౌన్సిలర్లు కూడా ఉన్నారట. ఈ ఇష్యూలో ఇద్దరిపై కేసు ఫైల్‌ చేశారు. మహేశ్వర్‌ రెడ్డి అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు నిఖిల్ పరారీలో ఉన్నాడట. ఎప్పటినుంచో సాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు కూడా ఎలా బయటకొచ్చిందటే.. నిందితుల్లో విభేదాలు రావడం వల్ల ఈ గబ్బు బాగోతం రచ్చకెక్కింది.

మరిన్ని మునుగోడు వార్తల కోసం