బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి.. సీఎం సమక్షంలో చేరిక

|

Jul 06, 2024 | 3:05 PM

భారత రాష్ట్ర సమితిలో మరో వికెట్ పడిపోయింది. గద్వాల రాజకీయాలు హైదరాబాద్‌కి చేరాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు.

బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి.. సీఎం సమక్షంలో చేరిక
Mla Bandla Krishna Mohan Reddy
Follow us on

భారత రాష్ట్ర సమితిలో మరో వికెట్ పడిపోయింది. గద్వాల రాజకీయాలు హైదరాబాద్‌కి చేరాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సీఎం రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవలే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా చేరికతో బీఆర్ఎస్ పార్టీని వీడిన వారి సంఖ్య 7కు చేరింది. అయితే మరికొందరు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన తెలుస్తోంది.

మరోవైపు, గద్వాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని మాజీ జెడ్పీ ఛైర్‌‌పర్సన్‌ సరితా తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన కాంగ్రెస్‌లోకి రాకుండా చివరి వరకూ విశ్వప్రయత్నాలు చేశారు. అయితే సరితకు సీఎం రేవంత్‌రెడ్డి సర్ధి చెప్పడంతో కృష్ణమోహన్‌రెడ్డి చేరికకు లైన్ క్లియర్ అయ్యింది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ లాగేస్తోంది. ఇది ఆ పార్టీకి ప్లస్సా, మైనస్సా అనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 65 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌.. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని బలం పెంచుకుంటోంది.

వీడియో ..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..