నాలుగోరోజు ‘నానబియ్యం బతుకమ్మ’.. వాయనం అదే!

| Edited By:

Oct 02, 2019 | 12:39 AM

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ.. తెలంగాణ ప్రజల బతుకు పండుగ ‘బతుకమ్మ’. పూల రూపంలో దేవతలను ఆరాధించే గొప్ప సంప్రదాయం మనది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ‘బతుకమ్మ’ ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ ఏడాది సెప్టెంబరు 28న బతుకమ్మ పండుగ మొదలైంది. ఇప్పటికే మూడురోజుల […]

నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ.. వాయనం అదే!
Follow us on

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ.. తెలంగాణ ప్రజల బతుకు పండుగ ‘బతుకమ్మ’. పూల రూపంలో దేవతలను ఆరాధించే గొప్ప సంప్రదాయం మనది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ‘బతుకమ్మ’ ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

ఈ ఏడాది సెప్టెంబరు 28న బతుకమ్మ పండుగ మొదలైంది. ఇప్పటికే మూడురోజుల పండుగలైన ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఇక బతుకమ్మ పండుగలో నాలుగోరోజైన ‘నానబియ్యం బతుకమ్మ’గా బతుకమ్మను కొలుస్తారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగంతరాలు బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు. నానబియ్యాన్ని ఫలహారంగా పెడతారు. వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ చెక్కరతో కానీ కలిపి ముద్దలు చేసి పెడతారు.