Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా.. నలుగురు మృతి, పలువురికి సీరియస్..!

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందల్వాయి - గన్నారం మధ్యలో అదుపు తప్పిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా.. నలుగురు మృతి, పలువురికి సీరియస్..!
Bus Accident

Updated on: Mar 13, 2026 | 8:36 AM

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందల్వాయి – గన్నారం మధ్యలో అదుపు తప్పిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నిజామాబాద్ ఆసుపత్రులకు తరలించారు.

ఆకోలో నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఇందల్వాయి – గన్నారం మధ్యలో అదుపు తప్పింది. దీంతో బస్సు బోల్తా పడిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో చనిపోయిన వారిని మంజూష , ఆమె కుమారుడు రిషి (7), బెంగళూరుకు చెందిన మహమ్మద్ అబ్బాస్, యూసఫ్‌గా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us